హిట్-1, హిట్-2, హిట్-3.. ఈ సినిమాలేంటి, ఆ జానర్ ఏంటి, అందులో హీరో పాత్రలేంటి? వీటన్నింటిపై ప్రేక్షకులకు ఓ క్లారిటీ ఉంది. నవ్వుదామన్నా ఒక్క జోక్ లేని సినిమాలివి. అన్నీ సీరియస్ క్రైమ్ డ్రామాలే.
ఇలాంటి వయొలెంట్ క్రైమ్ డ్రామాలు తీసిన దర్శకుడితో కెవ్వు కామెడీ చిత్రం తీస్తే ఎలా ఉంటుంది? హిట్ ఫ్రాంచైజీ చూసిన ఏ ప్రేక్షకుడికీ ఆ ఆలోచన రాదు. కానీ శైలేష్ కొలనుతో వర్క్ చేసిన నానికి మాత్రం, అతడితో ఓ కామెడీ ఎంటర్ టైనర్ చేయాలనిపించింది.
“రాబోయే హిట్ సిరీస్ లో కచ్చితంగా గెస్ట్ రోల్ చేయమంటాడు. అది కాకుండా, శైలేష్ తో నేను చేయబోయే ఫుల్ లెంగ్త్ సినిమా ఓ కామెడీ చిత్రం అవుతుంది. ఎందుకంటే, హిలేరియస్ కామిక్ టైమింగ్ ఉన్న దర్శకుడితడు. ఆల్రెడీ నాకు ఓ చిన్న ఆలోచన చెప్పాడు. చాలా హిలేరియస్ గా ఉంది.”
ఇలా శైలేష్ తో కామెడీ సినిమా చేస్తానని ప్రకటించాడు నాని. అది ఎప్పుడు జరుగుతుందో తనకు తెలియదని, కానీ శైలేష్ తో చేస్తే కామెడీనే చేస్తానని నాని ప్రకటించడం విశేషం. సెట్స్ లో శైలేష్ రోజూ జోకులేసేవాడని, అలాంటి దర్శకుడితో కామెడీ చిత్రం చేస్తే ఇంకా బాగుంటుందని అభిప్రాయపడ్డాడు నాని.