సమంత ఎందుకిలా చేసింది?

సినిమాలో ఆమెకున్నది 2-3 సన్నివేశాలు మాత్రమే. ఆ 2 సీన్లలో కూడా ఆకట్టుకోలేకపోయింది సామ్.

ఆమె రీఎంట్రీ కోసం లోకమంతా ఎదురుచూస్తోంది. ఆమె ఫ్యాన్స్ అయితే కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు. కానీ సమంతా ఇవేం పట్టించుకోలేదు. తనకు కావాల్సినంత గ్యాప్ తీసుకుంది. తీసుకుంటే, తీసుకుంది, ఓ మంచి ప్రాజెక్టుతో కమ్-బ్యాక్ అవుతుందని అంతా భావించారు.

కానీ సిల్వర్ స్క్రీన్ పైకి ఓ చిన్న అతిథి పాత్రతో వచ్చింది సమంత. అది కూడా ఏమాత్రం రక్తి కట్టకపోవడంతో ఆమె ఫ్యాన్స్ తెగ ఇదైపోతున్నారు. ‘శుభం’ అనే సినిమా తీసింది సమంత. ఇందులో మాయా అనే పాత్ర పోషించింది.

సినిమాలో ఆమెకున్నది 2-3 సన్నివేశాలు మాత్రమే. ఆ 2 సీన్లలో కూడా ఆకట్టుకోలేకపోయింది సామ్. విషయం లేని అలాంటి సన్నివేశాలతో సమంత రీఎంట్రీ ఇచ్చిందనే విషయం గుర్తొచ్చినప్పుడల్లా ఆమె ఫ్యాన్స్ బాధ తెగ బాధపడుతున్నారు.

ఏ మహేష్ బాబు సినిమాతోనో, బన్నీ ప్రాజెక్టుతోనో, ప్రభాస్ సరసనో మెరుస్తుందని భావించిన సమంతా, ఇలా 2 చిన్న సీన్లతో తన రీఎంట్రీని తుస్సుమనిపించింది. దీనికితోడు తను దేనికీ కనెక్ట్ కాలేకపోతున్నానని, అందుకే సినిమాలు చేయడం లేదంటూ మరో స్టేట్ మెంట్. సమంత ఎందుకిలా చేస్తోంది?

2 Replies to “సమంత ఎందుకిలా చేసింది?”

Comments are closed.