వీడియో లేదు.. ఓపెనింగ్ అయింది

దసరా సినిమా కాంబినేషన్ రిపీట్ కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని మరో సినిమా చేయబోతున్నాడనేది పాత విషయమే. ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసి ఈ సినిమాను గ్రాండ్…

దసరా సినిమా కాంబినేషన్ రిపీట్ కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని మరో సినిమా చేయబోతున్నాడనేది పాత విషయమే. ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసి ఈ సినిమాను గ్రాండ్ గా ప్రకటించడానికి ప్లాన్ చేశారు.

ఈ మేరకు ఎనౌన్స్ మెంట్ వీడియోకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తయింది. కానీ ఆ వీడియో రిలీజ్ చేయకుండానే, సినిమా ఓపెనింగ్ జరిగింది. దసరా సందర్భంగా ఈరోజు నాని-శ్రీకాంత్ ఓదెల కొత్త సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి.

దేవుడి చిత్రపటాలపై నాని క్లాప్ తో ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. ప్రస్తుతానికి పూజ జరిగిందని, మిగతా వివరాలన్నీ తర్వాత అందిస్తామని ప్రకటించారు. బహుశా.. ఎనౌన్స్ మెంట్ వీడియో ఇంకా రెడీ అవ్వలేదేమో. గత నెల 18న వీడియో షూటింగ్ ప్రారంభించారు.

ఈ సినిమాపై ఇప్పటికే చాలా విషయాలు ప్రచారంలోకి వచ్చాయి. హీరోయిన్ గా జాన్వి కపూర్ ను అనుకుంటున్నారని, మ్యూజిక్ డైరక్టర్ గా అనిరుధ్ ను తీసుకుంటున్నారని కథనాలొచ్చాయి. అయితే అవేవీ నమ్మొద్దంటూ నిర్మాత సుధాకర్ ఏకంగా ఓ ప్రకటన విడుదల చేయడం విశేషం.

5 Replies to “వీడియో లేదు.. ఓపెనింగ్ అయింది”

Comments are closed.