పదవి ముగియగానే బీఆర్ఎస్ కు దూరమవుతాడా?

తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఓ మాటన్నాడు. ఏమన్నాడు అంటారా? గులాబీ పార్టీకి తనకు సంబంధం లేదన్నాడు. సాంకేతికంగా చూస్తే ఆయన చెప్పింది కరెక్టే. ఆయన గులాబీ పార్టీ నుంచి చైర్మన్…

తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఓ మాటన్నాడు. ఏమన్నాడు అంటారా? గులాబీ పార్టీకి తనకు సంబంధం లేదన్నాడు. సాంకేతికంగా చూస్తే ఆయన చెప్పింది కరెక్టే. ఆయన గులాబీ పార్టీ నుంచి చైర్మన్ అయినప్పటికీ ఆ పదవిలో ఉన్నంత కాలం అంటే పదవీ కాలం ముగిసేవరకు తన పార్టీతో సంబంధం ఉండదు. ఉండకూడదు కూడా.

ఎందుకంటే అది రాజ్యాంగ పదవి కాబట్టి. ఈ పదవిలో ఉన్నంత కాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. గుత్తా అలాగే చేస్తున్నాడు కూడా. ఇక ఆయన బీఆర్ఎస్ కు దూరమవుతాడనే అనుమానం ఎందుకు కలుగుతుందంటే .. ఆయన గులాబీ పార్టీపై విమర్శలు చేశాడు.

ఉద్యోగ నియామకాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్ధించాడు. ప్రభుత్వం ఈమధ్య ఉద్యోగ నియామకాలు చేయడంపై కేటీఆర్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గుత్తా మాట్లాడుతూ ఉద్యోగ నియామకాలపై ఇప్పుడు విమర్శలు చేస్తున్నవారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించాడు.

ఎమ్మెల్యేల ఫిరాయింపులపై మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏం చేసిందో గుర్తు చేసుకుంటే మంచిదన్నాడు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్కరుగా ఆ పార్టీలో చేరిన తరువాతే విలీనం చేసుకున్నారని అన్నాడు. తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి గులాబీ పార్టీలో చేరగానే మంత్రి అయ్యాడని గుత్తా అన్నాడు.

గుత్తా వ్యవహారం చూస్తుంటే తన పదవీ కాలం ముగిశాక కాంగ్రెస్ లో చేరతాడా లేదా గులాబీ పార్టీ నుంచి బయటకు వచ్చి ఏ పార్టీలోనూ చేరకుండా ఉంటాడా! గుత్తా కొడుకు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరి ఏదో కార్పొరేషన్ కు చైర్మన్ కూడా అయ్యాడు కదా. మరి తండ్రి కూడా కొడుకు బాటనే ఫాలో అవుతాడా అనేది చూడాలి.

5 Replies to “పదవి ముగియగానే బీఆర్ఎస్ కు దూరమవుతాడా?”

Comments are closed.