నాని ధైర్యం రవితేజ కు రావాలి

హీరోలకు పెద్ద సమస్య ఇమేజ్ చట్రం. దాంట్లోంచి బయటకు రావడానికి కాస్త ప్రయత్నం చేస్తుంటారు. తేడా కొడితే మళ్లీ వెనక్కు వెళ్లిపోతుంటారు. తెగించడం అన్నది అందరికీ సాధ్యం కాదు. ఈ విషయంలో హీరో నాని…

హీరోలకు పెద్ద సమస్య ఇమేజ్ చట్రం. దాంట్లోంచి బయటకు రావడానికి కాస్త ప్రయత్నం చేస్తుంటారు. తేడా కొడితే మళ్లీ వెనక్కు వెళ్లిపోతుంటారు. తెగించడం అన్నది అందరికీ సాధ్యం కాదు. ఈ విషయంలో హీరో నాని సదా ప్రయత్నిస్తూనే వున్నాడు. 

ఫ్యామిలీ ఎంటర్ టైనర్లు దాటాలన్నది నాని ప్రయత్నం. అలా ప్రయత్నించినపుడల్లా ఫలితాలు అటు ఇటుగా వుంటున్నాయి. వి, గ్యాంగ్ లీడర్, దెబ్బతీసాయి. శ్యామ్ సింగ రాయ్, జెర్సీ ఊతం ఇచ్చాయి. దసరా సినిమా అయితే ఫుల్ కాంట్రాస్ట్. అయినా ధైర్యం చేసాడు. సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఈ ధైర్యమే రవితేజ‌కు రావాలి.

రవితేజ కు కూడా ఇదే సమస్య. సారొచ్చారు దగ్గర నుంచి అప్పుడప్పుడు కాస్త పక్కకు జరుగుదామని ట్రయ్ చేస్తే ఫలితం రావడం లేదు.  దాంతో తనదంటూ వున్న స్టయిల్ కే ఫిక్స్ అయిపోయారు. అలా చేస్తేనే ఢమాకా హిట్ అయింది. కానీ ఒకప్పుడు ఆడియన్స్ టేస్ట్ వేరు. ఇప్పుడు టేస్ట్ వేరు. ఇప్పుడు ప్రయోగాలు చేస్తే, అవి నచ్చితే ఓకె చేస్తున్నారు.

రవితేజ రావణాసుర సినిమా చూస్తుంటే అలాంటి ప్రయత్నం కనిపిస్తోంది. ఓ మాంచి థ్రిల్లర్ మూవీ ని చేస్తున్న ఛాయలు ట్రయిలర్ లో కనిపించాయి. కానీ అక్కడ కూడా కొంత వరకు రవితేజ రెగ్యులర్ సీన్లు కొన్ని వేసారు. బహుశా ఫ్యాన్స్ ఏమనుకుంటారో అని కొన్ని సీన్స్ అవి వేసి వుండొచ్చు. కానీ విడుదలకు ముందు అయినా పక్కా థ్రిల్లర్ టచ్ ట్రయిలర్ వదిలితే ఫ్యాన్స్ అర్థం చేసుకునే అవకాశం వుంది. వాళ్లను ప్రిపేర్ చేసినట్లూ అవుతుంది.

కథ నచ్చి, రవితేజ స్వయంగా సుధీర్ వర్మకు అప్పగించిన థ్రిల్లర్ సబ్జెక్ట్ ఇది. అంటే ఏదో విషయం వుండే వుంటుంది. అందువల్ల ధైర్యం చేసి సినిమాను ఆ దిశగా ప్రమోట్ చేస్తే బెటరేమో?