మన హీరోలు సినిమా షూటింగ్ కావచ్చు…వీలు దొరికితే కావచ్చు. విదేశాలకు ఛలో అంటారు. అందులోనూ సమ్మర్ అంటే మరీనూ.
ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే పరిస్థితి. శర్వానంద్ లండన్ లో వున్నారు. మే నెల వరకు సినిమా షూటింగ్ కోసం అక్కడే వుంటారు. మహేష్ బాబు మరో రెండు మూడు రోజుల్లో విదేశాలకు వెళ్తారు. త్రివిక్రమ్ సినిమాకు 20 రోజులు సమ్మర్ హాలీడేస్ ప్రకటించారు. నమ్రత అయితే ఇప్పటికే గత కొద్ది రోజులుగా విదేశాల్లోనే వున్నారు.
పవన్ కళ్యాణ్ జస్ట్ నాలుగైదు రోజులు షార్ట్ ట్రిప్ కు విదేశాలకు వెళ్లినట్లు బోగట్టా. ప్రభాస్ తన సలార్ సినిమా పని మీద విదేశాల్లోనే వున్నారు. ఇక రామ్ చరణ్ – బన్నీ సంగతి చెప్పనక్కరలేదు. ఏ క్షణం విదేశాల్లో వుంటారో, చటుక్కున ఎప్పుడు వచ్చేస్తారో తెలియనే తెలియదు.
హీరోలను చూసి నిర్మాతలు, దర్శకులు కూడా నేర్చుకుంటున్నారు. కాస్త ఫ్రెండ్స్ లో సేద తీరాలంటే ఛలో ఫారిన్ అంటున్నారు. మకావ్ వెళ్లే వాళ్లు కొంత మంది..దుబాయ్ వెళ్లేవాళ్లు మరి కొంత మంది. మొత్తం మీద హైదరాబాద్ ఎంత విదేశం మాదిరిగా అభివృద్ది చెందినా మన సినిమా సెలబ్రిటీలు ఫ్రీగా తిరగాలంటే విదేశాలే కావాలి.