సంచలనం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ!

మ‌నీలాండ‌రింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ రాసిన లేఖ సంచ‌ల‌నం రేపుతోంది. కేజ్రీవాల్ చెప్పిన‌ట్లు బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చిన‌ట్లు లేఖ‌లో ప్ర‌స్తావించారు. రూ. 15 కోట్ల చొప్పున ఐదుసార్లు రూ.…

మ‌నీలాండ‌రింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ రాసిన లేఖ సంచ‌ల‌నం రేపుతోంది. కేజ్రీవాల్ చెప్పిన‌ట్లు బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చిన‌ట్లు లేఖ‌లో ప్ర‌స్తావించారు. రూ. 15 కోట్ల చొప్పున ఐదుసార్లు రూ. 75కోట్లు ఇచ్చాన‌ని..హైదరాబాద్ లోని బీఆర్ఎస్ ఆఫీస్ ద‌గ్గ‌ర పార్క్  చేసిన వ్యక్తికి రూ. 15కోట్లు ఇచ్చిన‌ట్లు చెప్పారు.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో తాను మొత్తం 700 పేజీల వాట్సాప్, టెలిగ్రామ్ చాట్‌లు చేసినట్లుగా వెల్లడించారు. తన దగ్గర ఆధారాలు ఉన్నాయని త్వరలోనే వాటిని బయటపెడుతా అంటూ బాంబ్ పేల్చారు.  సుఖేష్ చంద్రశేఖర్ లేఖపై తెలంగాణ‌లో రాజ‌కీయ దుమారం రేగుతోంది. సుఖేష్ వెనుక బీజేపీ కుట్ర ఉంద‌ని బీఆర్ఎస్ నేత‌లు ఆరోపిస్తున్నారు.

గ‌తంలో కూడా సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ ప్ర‌స్తుతం జైలులో ఉన్న మాజీ మంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ నేత స‌త్యేంద్ర‌జైన్ పై కూడా ఇలాంటి విమ‌ర్శ‌లే చేశారు. జైల్లో ర‌క్ష‌ణ స‌దుపాయాలు క‌ల్పించేలంటే ప్ర‌తి నెలా రూ. 2కోట్లు క‌ట్టాల‌ని జైన్ డిమాండ్ చేసిన‌ట్లు దిల్లీ లెఫ్టినెంట్​ గవర్నర్​కు లేఖ రాశాడు. ఆప్ పార్టీ కోసం కూడా రూ.50 కోట్లకు పైగా డబ్బు సమకూర్చిన‌ట్లు లేఖ‌లో రాశారు.

రూ.200 కోట్ల హవాలా కేసులో ఆరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న సుఖేష్.. జైలు బయట ఎంత విలాసవంతమైన జీవితం అనుభవించాడో.. జైలు గోడల మధ్య కూడా అదే లగ్జరీని అనుభవిస్తున్నాడు. అత‌ని జైలు గదిని అకస్మాత్తుగా తనిఖీ చేసిన అధికారులకు కళ్లు బైర్లు కమ్మాయి. అందులో సుఖేష్ వాడే చెప్పుల విలువే లక్షన్నర కాగా.. అతడి 3 ప్యాంట్ల విలువ రూ.80 వేలు మరి.