ఆ ‘లిప్ కిస్’పై స్పందించిన హీరో

నాని సినిమాలు కుటుంబసమేతంగా చూసేలా ఉంటాయి. హింస, శృంగారం ఉంటాయి కానీ హద్దులుమీరి కనిపించవు. వయొలెన్స్ విషయంలో దసరా సినిమాతో కాస్త గీత దాటిన ఈ హీరో, తాజా చిత్రం హాయ్ నాన్నతో ముద్దుల…

నాని సినిమాలు కుటుంబసమేతంగా చూసేలా ఉంటాయి. హింస, శృంగారం ఉంటాయి కానీ హద్దులుమీరి కనిపించవు. వయొలెన్స్ విషయంలో దసరా సినిమాతో కాస్త గీత దాటిన ఈ హీరో, తాజా చిత్రం హాయ్ నాన్నతో ముద్దుల విషయంలో కూడా హద్దు దాటినట్టు కనిపించింది.

హాయ్ నాన్న సినిమా టీజర్ లో కిస్సులున్నాయి. దీనిపై నాని స్పందించాడు. సినిమాలో కావాలని అలాంటి సన్నివేశాలు పెట్టలేదని క్లారిటీ ఇచ్చాడు.

“నా గత చిత్రాలు దసరా, అంటే సుందరానికి సినిమాల్లో లిప్ కిస్సుల్లేవు. ఒకవేళ అలాంటి ముద్దు సీన్లు ఏమైనా ఉన్నప్పుడు ఇంటికెళ్లిన తర్వాత గొడవ అవుతుంటుంది. ఈ సంగతి పక్కనపెడదాం. నాకు నేనుగా ముద్దులకు సంబంధించి కొన్ని రూల్స్ పెట్టుకున్నాను. నా సినిమాల్లో ఎక్కడైనా సరదాగా పాటల్లోనో లేదా సీన్స్ లో లిప్ కిస్సులు పెట్టడం చూశారా? కథకు నిజంగా అవసరం అనిపిస్తేనే నేను లిప్ కిస్ పెడతాను. లేదంటే అస్సలు ఒప్పుకోను. నిజంగా డైరక్టర్ విజన్ లో అలాంటి ముద్దు సీన్ ఏదైనా ఉంటే, నేను దర్శకుడ్ని గౌరవిస్తాను, అలాంటి సన్నివేశాల్లో నటించడం నా బాధ్యత. తప్పకుండా చేస్తాను.”

ఇలా ముద్దు సన్నివేశాలపై క్లారిటీ ఇచ్చాడు నాని. హాయ్ నాన్న సినిమాలో కూడా కథ డిమాండ్ చేసింది కాబట్టే కిస్ చేయాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న సీక్వెల్స్ ట్రెండ్ పై కూడా స్పందించాడు. ట్రెండ్ నడుస్తోంది కాబట్టి సీక్వెల్ చేసేయాలనే తాపత్రయం తనకు లేదని, మంచి కథ సెట్ అయితే.. పిల్ల జమీందార్, భలే భలే మగాడివోయ్ సినిమాలకు సీక్వెల్స్ చేయొచ్చంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.