సుమ వివాదాన్ని మరోసారి గుర్తుచేసిన నాని

ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది. తమ ప్రచారం కోసం రాజకీయ పార్టీలన్నీ అందర్నీ వాడేస్తుంటే, హీరో నాని మాత్రం తన సినిమా ప్రచారం కోసం ఏకంగా ఎన్నికల్ని వాడేస్తున్నాడు. పొలిటీషియన్ గెటప్ లో వచ్చిన…

ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది. తమ ప్రచారం కోసం రాజకీయ పార్టీలన్నీ అందర్నీ వాడేస్తుంటే, హీరో నాని మాత్రం తన సినిమా ప్రచారం కోసం ఏకంగా ఎన్నికల్ని వాడేస్తున్నాడు. పొలిటీషియన్ గెటప్ లో వచ్చిన నాని, హాయ్ నాన్న సినిమా ప్రచారం కోసం ఓ వీడియోను విడుదల చేశాడు. అయితే ఇందులో అతడు తాజాగా సుమ వివాదాన్ని కూడా ఇంక్లూడ్ చేయడం విశేషం.

రీసెంట్ గా యాంకర్ సుమ వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఓ ప్రెస్ మీట్ కోసం హాజరైన మీడియా జనం, బయట టిఫిన్లు చేస్తున్నారు. వాళ్లను లోపలకు పిలిచేందుకు సుమ చేసిన వ్యాఖ్యలతో మీడియా హర్ట్ అయింది. బ్రేక్ ఫాస్ట్ ను భోజనంలా తింటున్న మీడియా వాళ్లు లోపలకు రావాలంటూ అప్పట్లో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదయ్యాయి. ఆ వెంటనే దానిపై భేషరతుగా క్షమాపణలు కూడా చెప్పింది సుమ.

ఈ మొత్తం వ్యవహారాన్ని నాని తన వీడియోలో టచ్ చేశాడు. పాలిటిక్స్ ఫ్లేవర్ లో రకరకాల డైలాగ్స్ చెప్పిన నాని, చివర్లో భోజనం చేశారా అంటూ సింబాలిక్ గా కామెంట్ చేస్తాడు. దీనిపై అక్కడున్న మీడియా వాళ్లు క్షమాపణలు చెప్పాలని కోరుతారు. నేను రాజకీయ నాయకుడ్ని, క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదంటూ అక్కడ్నుంచి జారుకుంటాడు నాని.

వీడియోకు ఈ ఎపిసోడ్ తోనే ముగింపు ఇచ్చారు. ఇలా అంతా మరిచిపోయిన వివాదాన్ని నాని మరోసారి గుర్తుచేసినట్టయింది. అన్నట్టు సుమ, మరోసారి ట్రోలింగ్ కు గురైంది. తాజాగా సప్తసాగరాలు దాటి సైడ్-బి సినిమా ప్రచారంలో భాగంగా హీరోను ఇంటర్వ్యూ చేసిన సుమ, సరిగ్గా హోంవర్క్ చేయకుండా ఇంటర్వ్యూ చేసి సోషల్ మీడియాలో అభాసుపాలైంది.