Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఎక్స్ క్లూజివ్-నాని-టక్ జగదీష్

ఎక్స్ క్లూజివ్-నాని-టక్ జగదీష్

టాలీవుడ్ లో చిత్రమైన టైటిల్స్ వస్తున్నాయి. అది ఈ మధ్య కొత్తగా వచ్చిన ట్రెండ్ కాదు. దాదాపు మూడు నాలుగేళ్లుగా జరుగుతోంది. రకరకాల టైటిళ్లు వస్తున్నాయి. అలాంటి వైవిధ్యమైన టైటిల్ విన్నపుడు 'ఇది టైటిలా?' అనిపిస్తుంది.తీరా అది అలా అలా పాపులర్ అయిపోయాక, ఇది కదా టైటిల్ అనేలా చేస్తుంది.

ఇంతకీ అసలు విషయానికి వస్తే, నాని-శివనిర్వాణ కాంబినేషన్ ఓ సినిమా పైనల్ అయిందని, అలాగే ఆ సినిమాలో హీరోయిన్లు వీరేనని, సినిమా లైన్ ఇదేనని, ఇలా ప్రతి అప్ డేట్ ను ఎక్స్ క్లూజివ్ గా అందిస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఆ సినిమా టైటిల్ ఎక్స్ క్లూజివ్ గా మీ కోసం.

నాని-శివనిర్వాణ సినిమా జనవరిలో ప్రారంభం అవుతుంది. అయితే సినిమాకు ఓపెనింగ్ చేద్దాం అనుకుని, నగర శివార్లలో జరిగిన అనుకోని దుర్ఘటనతో వాయిదా వేసారు. సింపుల్ గా ఓ ప్రకటన చేసి, జనవరిలో పూజ, షూటింగ్ ఒకేసారి చేసేయాలని డిసైడ్ అయ్యారు.

ఈ మేరకు మంగళవారం టైటిల్ అనౌన్స్ మెంట్ చేయబోతున్నారు. ఇంతకీ ఆ టైటిల్ ఏమిటంటే...'టక్-జగదీష్' అని వినిపిస్తోంది. ఆరేడుగురు అన్నదమ్ముల్లో మధ్యవాడికిగా కనిపించే నానికి సినిమాలో ఇది నిక్ నేమ్ అని తెలుస్తోంది. అందుకే అదే టైటిల్ ఫిక్స్ చేసి, మంగళవారం ప్రకటించే ఆలోచనలో వుంది యూనిట్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?