జగన్ కి సినిమా స్టార్స్ మద్దతు బహు తక్కువ. అందులో పొగిడేవారు కూడా ఉంటారా అన్నది ఇంటెరెస్టింగ్ పాయింటే. అయితే జనాల సమస్యలనే తన ఇతివృత్తాలుగా చేసుకుని ఎన్నో సినిమాలు తీసిన పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి లాంటి వారు మాత్రం సినీ జనాల్లో వేరు అని చెప్పాలి.
ఆయనకు కావాల్సింది బడుగు జనాల ప్రయోజనమే తప్ప తన స్వార్ధం కానే కాదు. అలా పేద జనం కోసం మేలు చేసే నాయకుడు ఎవరు ఉన్నా నారాయణమూర్తి మనసు విప్పి మరీ పొగుడుతారు. తాజాగా ఆయన అలాంటి భారీ స్టేట్మెంటే జగన్ మీద ఇచ్చేశారు.
జగన్ మంచి విజన్ ఉన్న నేత అని కితాబు ఇస్తున్నారు. అంతే కాదు దేశంలో ఇన్ని సంక్షేమ పధకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కూడా జగన్ ఒక్కరేనని అంటున్నారు. జగన్ మంచి పనులు చేస్తున్నారు కాబట్టే తాను మద్దతు ఇస్తున్నానని నారాయణమూర్తి కుండబద్దలు కొట్టారు.
తనకు రాజకీయాలు అనవసరమని జగన్ మాత్రం ఏపీకి మంచి చేస్తున్నారని ఆయన అంటున్నారు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లా మెట్ట ప్రాంతం రైతుల కోసం ఏలేరు తాండవ రజర్వాయర్లను అనుసంధానం చేయడం అన్నది గొప్ప నిర్ణయమని ఆయన అంటున్నారు. దీని ద్వారా అసలైన రైతు బాంధవుడుగా జగన్ నిలిచిపోయారని కూడా కీర్తిస్తున్నారు.
ఇక జగన్ వల్లనే ఉత్తరాంధ్రా అభివృద్ధి సాధ్యపడుతుంది అని కూడా నారయణమూర్తి చెబుతున్నారు. గతంలో కూడా మూడు రాజధానుల ప్రతిపాదనను ఆయన సమర్ధించిన సంగతి విధితమే.
వామపక్ష భావాలు నిండుగా ఉన్న ఆర్ నారాయణమూర్తి లాంటి వారు జగన్ జనం కోసం పడుతున్న శ్రమను గుర్తించారు అంటే ఇక అంతకంటే వేరే సర్వేలు, శోధనలు జగన్ పాలన మీద అవసరం లేదేమో.