సీనియర్ నటులు నరేష్-పవిత్ర కొత్త జీవితాన్ని ప్రారంభించారు. మైసూరులో అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగినట్లుగా తెలుస్తోంది. కొంతకాలంగా పవిత్రతో రిలేషన్ లో ఉన్న నరేష్.. కొత్త ఏడాది కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ఆమెను ముద్దు పెట్టుకునే వీడియోను గత సంవత్సరం డిసెంబర్ 31 రిలీజ్ చేశారు.
కాగా నరేష్ మూడో భార్య రమ్య రఘపతితో విభేదాలు కారణంగా పెద్ద రచ్చ నడిచింది. నరేష్-పవిత్రలను ఓ హోటల్ రూమ్ లో మూడో భార్య రమ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో మీడియాలో, సోషల్ మీడియాలోను పెద్ద చర్చ జరిగింది.
గతంలో మూడో భార్య మీడియా ముందుకు వచ్చి తనకి పిల్లలు ఉన్నారని ఇంకా సెటిల్ చేయకుండా పెళ్లి చేసుకోవడం ఏంటని నరేష్ ని ప్రశ్నించింది. మరి మూడో భార్యతో సెటిల్ చేసుకున్నారా లేదా అనేది తెలియల్సి ఉంది.