సీనియర్ హీరో నరేష్-పవిత్రా లోకేష్ కాంబినేషన్ లో సీనియర్ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో తయారవుతున్న సినిమా మళ్లీ పెళ్లి. ఈ సినిమా టీజర్ వచ్చేసింది.
కేవలం వైరల్ కావాలి అనే యాంగిల్ లో ఆలోచించి ఈ టీజర్ కట్ చేసినట్లుంది. సీనియర్ హీరో నరేష్ తొలి పెళ్లి, ఇప్పుడు కొత్తగా వచ్చిన పవిత్రా లోకేష్ వ్యవహారం, ఈ నేపథ్యంలో తొలి భార్య మీడియా మీట్ ఇలా అన్నీ తెలిసినవే. ఇప్పుడు అవన్నీ కలిసి ఓ టీజర్ గా మారితే ఇలాగే వుంటుంది.
టీజర్ లో వేసిన సీన్లు అన్నీ నరేష్ వ్యవహారాలను మరోసారి గుర్తు చేసాయి. నరేష్, పవిత్రా లోకేష్ పాత్రలు కొత్తగా అనిపించలేదు. యూ ట్యూబ్ లో చూసిన సీన్లు, విన్న డైలాగులు, ఎంజాయ్ చేసిన వీడియోలు గుర్తుకువస్తాయంతే. మేకర్లు కూడా కావాలనే ఇలాంటి టీజర్ కట్ చేసి వుండొచ్చు. సినిమాకు ఇంతకన్నా ఫ్రీ పబ్లిసిటీ తెచ్చి పెట్టే టీజర్ మరోటి వుండదు కదా.
నరేష్ తొలి భార్య క్యారెక్టర్ అనిపించేలా డిజైన్ చెేసిన పాత్రలో వనిత విజయ్ కుమార్ కనిపించారు. నరేష్ ఫ్యామిలీ బ్యానర్ విజయకృష్ణా మూవీస్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. మే నెలలో ఈ సినిమా విడుదలవుతుంది.