ఎన్టీఆర్ దిగిరావాల్సిందేనా..?

మీరాచోప్రా – ఎన్టీఆర్ సోషల్ మీడియా వార్ విషయంలో మీటూ హ్యాష్ ట్యాగ్ ఒక్కటే లేదు కానీ.. మిగతా మసాలా కావాల్సినంత ఉంది. 2 రోజుల్లో చల్లారుతుందనుకున్న ఈ విషయం, సైబరాబాద్ పోలీసులు కేసు…

మీరాచోప్రా – ఎన్టీఆర్ సోషల్ మీడియా వార్ విషయంలో మీటూ హ్యాష్ ట్యాగ్ ఒక్కటే లేదు కానీ.. మిగతా మసాలా కావాల్సినంత ఉంది. 2 రోజుల్లో చల్లారుతుందనుకున్న ఈ విషయం, సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత కూడా తగలబడుతూనే ఉంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ గా చెప్పుకుంటున్న కొంతమంది మరింతగా రెచ్చిపోవడం, వాటికి మీరా చోప్రా కౌంటర్లివ్వడం కొనసాగుతూనే ఉంది.

కేవలం సోషల్ మీడియాలోనే కాదు.. నేషనల్ ఛానెళ్లకు ఫోన్ ద్వారా ఇంటర్వ్యూలిచ్చి మీరా చోప్రా మరింత మంట రాజేసింది. పదే పదే ఎన్టీఆర్ పేరు ప్రస్తావనకు తేవడం, జాతీయ మీడియాలో కూడా ఎన్టీఆర్ ఫొటోల్ని పదే పదే చూపించడం లాంటి వ్యవహారాలతో మన జూనియర్ కూడా ఇక రంగంలోకి దిగాల్సిన అవసరం ఉందని అర్థమవుతోంది.

ఈ గొడవని ఇక్కడితో ఆపాలంటే ఎన్టీఆర్ నోరు విప్పాల్సిందే. క్షమాపణలు చెప్పడం లాంటి వ్యవహారాలు లేకపోయినా, కనీసం అభిమానులు, లేదా ఆయన పేరు చెప్పుకుంటూ గొడవ చేస్తున్న దురభిమానులకైనా ఓ వార్నింగ్ ఇవ్వాలి. లేకపోతే ఆర్ఆర్ఆర్ విడుదల కంటే ముందే దేశవ్యాప్తంగా ఎన్టీఆర్ బాగా నెగెటివ్ గా పాపులర్ అయ్యే ప్రమాదముంది.

ఎన్టీఆర్ సంగతి పక్కనపెడితే.. ఇప్పుడు మీరా చోప్రా మాత్రం దేశవ్యాప్తంగా ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. లాక్ డౌన్ టైమ్ లో లైమ్ లైట్లో ఉన్న హీరోయిన్లు, లేనివాళ్లు.. యోగాలు చేసి, ఎక్సర్సైజ్ లు చేసి, సెక్సీగా ఫొటోషూట్ లు చేసి కాస్తో కూస్తో ఫేమస్ అయ్యారు కానీ, మీరా చోప్రా 4 రోజుల్లోనే టాక్ ఆఫ్ ది నేషన్ గా మారిపోయింది.

ఇటీవల కాలంలో మీటూ పేరుతో చాలామంది నటులపై ఆరోపణలు వచ్చాయి కానీ, ఇలా సంబంధం లేకుండా ఓ హీరోయిన్ తో మాటలు పడ్డ కష్టకాలం ఒక్క ఎన్టీఆర్ ది మాత్రమే. ఈ వివాదానికి ఎన్టీఆర్ ఫుల్ స్టాప్ పెడతారా, లేక ఈ ఎపిసోడ్ ఇలానే కొనసాగుతూ.. మరింత ఆసక్తిగా మారుతుందా వేచి చూడాలి.

ఈ మొత్తం ఎపిసోడ్ లో ట్విస్ట్ ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్ అంటే ఇంకా సమైక్య రాష్ట్రం అనుకునే లెక్కలో ఉంది మీరా చోప్రా. అందుకే హైదరాబాద్ సిటీ పోలీస్ లకు కంప్లయింట్ చేస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ ని, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితను తన ట్వీట్లలో ట్యాగ్ చేస్తోంది. హైదరాబాద్ పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్ కి ఏపీ సీఎం కి సంబంధం ఏంటి? ఎన్టీఆర్ నివశించే ప్రాంతంలో కేసు పెట్టాలంటే హైదరాబాద్ పోలీసులకు కంప్లయింట్ చేసి, తెలంగాణ సీఎం కేసీఆర్ పేరో, మంత్రి కేటీఆర్ పేరునో లేక, హోం మంత్రి పేరునో తన ట్వీట్లకు జతపరచాలి. ఇందులో ఏపీ సీఎం, ఏపీ మంత్రులు చేయడానికేముంది. మొత్తానికి మీరా చోప్రా మాత్రం కాస్త విచిత్రంగానే ప్రవర్తిస్తోంది. ఇక ఎన్టీఆర్ ఎంట్రీనే ఇప్పుడు బ్యాలెన్స్ ఉంది. 

మాట ఇచ్చాను.. నిలబెట్టుకున్నాను