నేహాశెట్టి… అరకోటి

డిజె టిల్లు రాధిక గా జనాలకు ఫుల్ గా నచ్చేసింది నేహాశెట్టి. ఆ తరువాత ఇంకా సరైన సినిమా పడలేదు. ఈ నెలలో రాబోతున్న బెదురులంక సినిమా మీద మంచి ఆశలే పెట్టుకుంది. పైగా…

డిజె టిల్లు రాధిక గా జనాలకు ఫుల్ గా నచ్చేసింది నేహాశెట్టి. ఆ తరువాత ఇంకా సరైన సినిమా పడలేదు. ఈ నెలలో రాబోతున్న బెదురులంక సినిమా మీద మంచి ఆశలే పెట్టుకుంది. పైగా ఆ సినిమా మేకర్లు కూడా నేహా ను ఎంత వరకు చూపించాలో, ఎలాంటి పాత్రలో చూపించాలో ఫుల్ క్లారిటీతో వున్నట్లు కనిపిస్తోంది ఇప్పటి వరకు వచ్చిన పబ్లిసిటీ మెటీరియల్ చూస్తుంటే.

అయితే ఇంతకీ ప్రస్తుతం నేహా రెమ్యూనిరేషన్ ఎంత? పెద్దగా సినిమాలు ఏవీ లేవు కనుక తక్కువే వుంటుందేమో అని అనుకోవడానికి లేదు. డిజె టిల్లు తెచ్చిన క్రేజ్ అలాంటిది మరి. 

బెదురులంక సినిమాకు పక్కాగా అరకోటి రెమ్యూనిరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. నలభై లక్షలు రెమ్యూనిరేషన్, దీనికి జిఎస్టీ అదనం. ఇది కాక పర్సనల్ స్టాఫ్, ఇంకా ఇంకా ఖర్చులు వుండనే వుంటాయి.

బెదురులంక సినిమాలో కార్తికేయ హీరో. సినిమా మొత్తం యానాం సమీపంలోని ఎదుర్లంక లో చిత్రీకరించారు. మొత్తం అవుట్ డోర్ షూట్ కావడం, చాలా ఎక్కువ మంది నటీనటులు వుండడంతో ఈ సినిమాకు అన్నీ కలిపి 13 కోట్ల వరకు ఖర్చయినట్లు తెలుస్తోంది.