తనను తాను షారూక్ ఖాన్, శ్రీదేవితో పోల్చుకుంది నేహా శెట్టి. రెండు అంశాల్లో తను షారూక్ ఖాన్, శ్రీదేవికి దగ్గరగా ఉంటానని అంటోంది. ఇంతకీ ఏంటా రెండు అంశాలు..?
“మనం పోషించిన పాత్ర పేరుతో మనల్ని పిలవడం ఏ నటుడికైనా గొప్ప ప్రశంస. పోలిక తీస్తున్నానని కాదు కానీ.. షారుఖ్ ఖాన్ ను బాద్షా అని పిలుస్తారు. నేను కెరీర్ ప్రారంభంలోనే డీజే టిల్లూతో రాధిక అని పేరు తెచ్చుకోవడం సంతోషంగా ఉంది. ప్రేక్షకుల హృదయాల్లో ఆ పాత్ర అంతటి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అందుకే వాళ్ళు అభిమానంతో నన్ను రాధిక అని పిలుస్తున్నారు. దానిని గౌరవంగా భావిస్తాను.”
షారూక్ ను బాద్షా అనే బిరుదు ఎలా వచ్చిందో, తనకు రాధిక అనే టైటిల్ వచ్చిందంటోంది నేహా. ఇక కొంతమంది తనను శ్రీదేవితో పోల్చడంపై కూడా స్పందించింది.
“ఇప్పుడు వాన పాటలంటే చాలామందికి నేనే గుర్తొస్తున్నాను. అప్పట్లో వాన పాటలంటే శ్రీదేవి గుర్తుకొచ్చే వారు. అంత గొప్ప నటిలా.. ఇప్పుడు నాకు ఎక్కువ వాన పాటల్లో కనిపించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను.”
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో విశ్వక్ సేన్ సరనస హీరోయిన్ గా నటించింది నేహా శెట్టి. ఈ సినిమాలో విశ్వక్ పాత్ర 50 శాతమైతే, అంజలిది 25శాతం, తనది మిగతా 25శాతం అని అంటోంది.