తెరపై రొమాన్స్.. తెరవెనక దైవభక్తి

నేహా శెట్టి.. టాలీవుడ్ లో హాట్ బ్యూటీ. డీజే టిల్లూ సినిమాతో ఆమెకు ఈ హాట్ ఇమేజ్ వచ్చేసింది. ఇక రిలీజ్ కు రెడీ అయిన రూల్స్ రంజన్  సినిమాలో కూడా ఆమె క్యారెక్టర్…

నేహా శెట్టి.. టాలీవుడ్ లో హాట్ బ్యూటీ. డీజే టిల్లూ సినిమాతో ఆమెకు ఈ హాట్ ఇమేజ్ వచ్చేసింది. ఇక రిలీజ్ కు రెడీ అయిన రూల్స్ రంజన్  సినిమాలో కూడా ఆమె క్యారెక్టర్ కాస్త బోల్డ్ గానే ఉంది. రిలీజైన సాంగ్ లో ఆమె అందాల ప్రదర్శన కూడా వేడి పుట్టించేలా ఉంది.

అయితే ఇవన్నీ తెర వరకు మాత్రమే అంటోంది రాధిక అలియాస్ నేహా శెట్టి. తెర వెనక మాత్రం తన జీవితం పూర్తిగా భిన్నం అంటోంది. మరీ ముఖ్యంగా తనకు దైవభక్తి చాలా ఎక్కువని, ఇప్పటికే చాలా గుళ్లు కవర్ చేశానని చెబుతోంది.

“సినిమాల్లో నేను పోషించిన పాత్రలకు, నా రియల్ లైఫ్ కు అస్సలు సంబంధం ఉండదు. నాకు దైవ భక్తి చాలా ఎక్కువ. ఇంట్లో ఎప్పుడూ పూజలుంటాయి. ప్రతి 3 నెలలకు ఒకసారి తీర్థయాత్రలకు వెళ్తాను. దక్షిణాదిలో ముఖ్యమైన దేవాలయాలన్నీ ఇప్పటికే కవర్ చేశాను. ఉత్తరాదిన కూడా కాశి లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్ని దర్శించాను. నాకు ఈ భక్తి, నా తల్లిదండ్రుల నుంచి వచ్చింది. వాళ్లకు దైవ భక్తి ఎక్కువ. వాళ్లంత కాకపోయినా నేనూ దేవుడ్ని నమ్ముతాను, తీర్థయాత్రలు చేస్తాను.”

తెరపై రొమాంటిక్ గా కనిపించే నేహా, తెరవెనక మాత్రం ఇంత భక్తితో ఉంటుందనే విషయం కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది ఎవరికైనా. కానీ అదే నిజం అంటోంది ఈ బ్యూటీ. ఒకప్పుడు దేవుడ్ని ఇది కావాలి, అది కావాలి అని అడిగేదాన్నని.. కానీ ప్రస్తుతం దేవుడ్ని ఏం కోరడం లేదని, ప్రతి రోజూ థ్యాంక్స్ చెబుతున్నానని, తనకు ఈ లైఫ్ చాలని అంటోంది.

ప్రస్తుతం టాలీవుడ్ లీడింగ్ హీరోయిన్స్ లో ఒకరిగా కొనసాగుతోంది నేహా శెట్టి. రీసెంట్ గా బెదురులంకతో థియేటర్లలోకి వచ్చింది. త్వరలోనే రూల్స్ రంజన్ తో కలిసి తెరపైకి రాబోతోంది. విశ్వక్ సేన్ సరసన చేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా మరో 2 నెలల్లో రిలీజ్ అవుతుంది.