పోపోవ‌మ్మా దేశం విడిచి…బాలీవుడ్ న‌టిపై నెటిజ‌న్ల ఫైర్‌

బాలీవుడ్ హీరోయిన్ త‌న అభిమానుల‌కి కోపం తెప్పించింది. ఇందుకు ఆమె చేసిన ఓ ట్వీటే కార‌ణం. బాలీవుడ్ హీరోయిన్‌గా భార‌తీయుల అభిమానాన్ని చూర‌గొన్న స‌ద‌రు న‌టి, ఆ విష‌యాన్ని మ‌రిచి త‌న దేశానికి ఒత్తాసు…

బాలీవుడ్ హీరోయిన్ త‌న అభిమానుల‌కి కోపం తెప్పించింది. ఇందుకు ఆమె చేసిన ఓ ట్వీటే కార‌ణం. బాలీవుడ్ హీరోయిన్‌గా భార‌తీయుల అభిమానాన్ని చూర‌గొన్న స‌ద‌రు న‌టి, ఆ విష‌యాన్ని మ‌రిచి త‌న దేశానికి ఒత్తాసు ప‌ల‌క‌డ‌మే అభిమానుల ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌ని చెప్పొచ్చు. అభిమానుల‌ కోపానికి గురైన ఆ బాలీవుడ్ హీరోయిన్ మనీషా కోయిరాలా.

అస‌లేం జ‌రిగిందంటే…భార‌త్‌లోని స‌రిహ‌ద్దు ప్రాంతాల‌ను నేపాల్ దేశం త‌నవిగా పేర్కొన్న మ్యాప్‌ను మ‌నీషా స‌మ‌ర్థించారు. భార‌త్‌లోని లిపులేఖ్‌, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలు త‌మ దేశ అంత‌ర్గ‌త భూభాగాలుగా చూపుతూ నేపాల్ మంత్రి మండ‌లి కొత్త మ్యాప్‌ను ఆమోదించడం వివాదానికి దారి తీసింది.

ఈ నేప‌థ్యంలో మ‌నీషా ట్విట‌ర్ వేదిక‌గా స్పందిస్తూ ‘మ‌న చిన్న దేశాన్ని గౌర‌వంగా ఉంచినందుకు కృత‌జ్ఞ‌త‌లు. ఇప్పుడు మూడు గొప్ప దేశాల మ‌ధ్య శాంతియుత‌మైన‌, గౌర‌వ‌ప్ర‌ద‌మైన చ‌ర్చ‌ల కోసం ఎదురు చూస్తున్నాం’ అని ఆమె ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ మ‌నీషా అభిమానుల‌కు, నెటిజ‌న్ల‌కు తీవ్ర ఆగ్ర‌హం తెప్పించింది.

‘మీరు భార‌త్ విడిచి వెళితే మంచిది. ఈ మూడు ప్రాంతాలు భార‌త్‌లోనివే. నేను కూడా నేపాల్‌కు చెందిన వ్య‌క్తినే. నేనెప్పుడూ భార‌త్‌కు మ‌ద్ద‌తిస్తా’ అని ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు.

అలాగే మ‌రో నెటిజ‌న్ స్పందిస్తూ…వెళ్లి మీ దేశ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో సంపాదించుకోండి అని సీరియ‌స్‌గా రియాక్ట్ అయ్యాడు. మ‌నీషాపై మ‌రికొంద‌రు నెటిజ‌న్ల అభిప్రాయాల‌ను చూద్దాం. భార‌త్ నుంచి ఎంతో పొందిన మీ లాంటి వారు నేపాల్ గౌర‌వాన్ని భార‌త్ భంగ‌ప‌ర‌చిన‌ట్టు మాట్లాడుతున్నారని పేర్కొన్నాడు. మ‌రొక‌రు…మిమ్మ‌ల్ని భార‌తీయ న‌టిగానే భావిస్తాను, మీ వ్యాఖ్య‌లు చాలా బాధించాయి అని త‌మ నిర‌స‌న తెలిపారు.