అన్ని విషయాల్లో కామెడీ పనికి రాదు. మరీ ముఖ్యంగా సున్నితమైన విషయాల్లో అస్సలు జోకులు వేయకూడదు. ఈ విషయం తెలిసి కూడా తాప్సి తన పెళ్లిపై గతంలో జోకులేసింది. ఇప్పుడు వాటికి ఫలితం అనుభవిస్తోంది. తను వేసిన జోకులే తనకు రివర్స్ లో తలుగుతుంటే, సోషల్ మీడియాలో సైలెంట్ అయింది.
ఇంతకీ మేటర్ ఏంటంటే.. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు 'మథియాస్ బో'తో చాన్నాళ్లుగా డేటింగ్ చేస్తోంది తాప్సి. అతడితో లవ్ లో ఉన్న విషయాన్ని కూడా ఆమె బయటపెట్టింది. దీంతో పెళ్లి ఎప్పుడనే ప్రశ్న కామన్ అయిపోయింది. ఓసారి ఇలానే తాప్సికి ఈ ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె వ్యంగ్యంగా స్పందించింది. తానింకా గర్భవతిని కాలేదని, గర్భం దాల్చినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానంటూ సెటైర్ వేసింది.
ఆమె అలా అనడానికి కారణం ఏంటో అందరికీ తెలిసిందే. ఆ టైమ్ లో అలియాభట్ తన గర్భం గురించి బయటపెట్టింది. గర్భం దాల్చిన తర్వాతే పెళ్లి చేసుకున్నానని, అప్పట్లో అలియా ప్రకటించింది. యాదృచ్చికంగా అదే టైమ్ లో ఇలియానా కూడా గర్భందాల్చింది. ఆ తర్వాతే ఆమె పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్లను దృష్టిలో పెట్టుకొని పరోక్షంగా అలా స్పందించింది తాప్సి.
తన జోక్ తనకే రివర్స్ అయింది.. కట్ చేస్తే.. ఇప్పుడు తాప్సి పెళ్లిపై పుకార్లు మొదలయ్యాయి. మార్చి 13న తాప్సి-మథియాస్ పెళ్లి చేసుకుంటారనే ప్రచారం ఊపందుకుంది. దీనిపై తాజాగా తాప్సి స్పందించింది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎవ్వరికీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని, భవిష్యత్తులో కూడా తన ప్రైవేట్ లైఫ్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వనని స్పష్టం చేసింది.
సరిగ్గా ఇక్కడే నెటిజన్లు తమ తెలివితేటలు ప్రదర్శించారు. తాప్సి గత ప్రకటనను గుర్తుచేస్తూ, ఇంకా గర్భం దాల్చలేదా అంటూ సెటైర్లు వేస్తున్నారు. గర్భం దాల్చిన తర్వాతే పెళ్లి చేసుకుంటావా అంటూ ఆమె స్టేట్ మెంట్ నే తిరిగి గుర్తుచేస్తున్నారు. అలా తాప్సి వేసిన జోక్ ఆమెకే రివర్స్ లో తగులుతోంది.