అనకాపల్లిని ఎంచుకున్న జగన్!

ఉమ్మడి విశాఖ జిల్లలో రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతంగా అనకాపల్లిని అంతా చెప్పుకుంటారు. ఈ రోజు అనకాపల్లి జిల్లా అయింది. రాజకీయం అంతా అక్కడే తిరుగుతోంది. అనకాపల్లి జిల్లాలో మొత్తం సీట్లు వైసీపీ ఖాతాలో…

ఉమ్మడి విశాఖ జిల్లలో రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతంగా అనకాపల్లిని అంతా చెప్పుకుంటారు. ఈ రోజు అనకాపల్లి జిల్లా అయింది. రాజకీయం అంతా అక్కడే తిరుగుతోంది. అనకాపల్లి జిల్లాలో మొత్తం సీట్లు వైసీపీ ఖాతాలో ఉన్నాయి.

మరోసారి ఆ మ్యాజిక్ ని రిపీట్ చేసేందుకు జగన్ యాక్షన్ ప్లాన్ తో రెడీగా ఉన్నారు. అనకాపల్లి ఇపుడు హాట్ హాట్ పాలిటిక్స్ కి కేంద్ర బిందువుగా ఉంది. నాగబాబు అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారు అని వార్తలు వస్తున్నాయి. ఒకనాడు వైసీపీలో ఉన్న మాజీ మంత్రి కొణతాల అనకాపల్లి నుంచి జనసేన తరఫున ఎమ్మెల్యేగా పోటీ పడుతున్నారు

ఈ పరిణామాల నేపధ్యంలో ముఖ్యమంత్రి జగన్ అనకాపల్లి నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మార్చి  7వ తేదీన అనకాపల్లిలో నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.

బహిరంగ సభతో పాటు మొత్తం అనకాపల్లిని కలియతిరిగే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించనున్న రోడ్ షో కూడా ఈసారి హైలెట్ కాబోతోంది. అనకాపల్లిని తాము ఏ పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు అన్నదే జగన్ పట్టుదలగా ఉంది.

జనసేన టీడీపీ ఉమ్మడి రాజకీయానికి అనకాపల్లి నుంచే చెక్ పెట్టేందుకు జగన్ తన కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు అని అంటున్నారు. అనకాపల్లి నుంచే జయభేరీ మోగించడం ద్వారా మరోసారి వైసీపీ జెండా రెపరెపలాండించాలన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.

అనకాపల్లికి వైసీపీ ఏమి చేసింది, టీడీపీ ఏమి చేయలేదు అన్నది జగన్ తన బహిరంగ సభ ద్వారా వివరించనున్నారు. ఒక విధంగా చూస్తే ఈ సభ ద్వారా విపక్షానికి సవాల్ చేయనున్నారు అని అంటున్నారు.