'ఎప్పటికీ జగన్ సీఎం కాలేడు, జగన్ ను సీఎం కానివ్వను, ఇదే శాసనం.. 'అంటూ ఏదేదో పేలారు 2019 ఎన్నికల ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్! జగన్ ను సీఎం చేయడం అనేది జనం చేతిలో పని తప్ప, తనేదో విధాతను కాదని పవన్ అప్పుడు గ్రహించలేకపోయాడు! ఇది ప్రజాస్వామ్యం అని, అన్నీ చంద్రబాబు వ్యూహాల మేరకు, తను పని చేస్తే అంతా అయిపోతుందని పవన్ కు అప్పుడు జ్ఞానం లేకపోయింది!
కట్ చేస్తే.. ఇప్పుడు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ జగన్ ను ఏకంగా పాతాళానికి తొక్కేస్తాడట! తనకు చంద్రబాబు విధించిన వీరముష్టి 24 సీట్లను సమర్థించుకోవడానికి తనో వామనుడిని, తను జగన్ ను పాతాళానికి తొక్కేస్తానంటూ ఊగిపోయాడు! దీన్ని బట్టి అర్థం అవుతున్నది ఏమిటంటే పవన్ ఇంకా పాత పవనే అని!
'జగన్ ను సీఎం కానివ్వను, జగన్ సీఎం ఎలా అవుతాడో చూస్తా, నా మాటే శాసనం..' అన్నట్టుగా మాట్లాడి, ఆఖరికి రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయిన అహంభావిగా పవన్ నిలిచాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలు అనుకున్నది జరుగుతుంది తప్ప, తనబోటి నటులు చెప్పేది జరుగుతుందని పవన్ అప్పుడు భ్రమ పడ్డాడు. అయితే ఆ భ్రమల్లోంచి ఇంకా బయటకు రాలేదని ఆయన తాజా ప్రసంగం చెబుతోంది. 'పాతాళానికి తొక్కుతా, వీరంగం వేస్తా..' అంటూ పవన్ పోతురాజులా ఊగిపోతున్నాడు.
ఈ మాటలు పవన్ కల్యాణ్ లోని అహాన్ని, ఆ అహం దెబ్బతిని అక్కసుతో రగిలిపోతుండటాన్ని చాటుతున్నాయి తప్ప, రాజకీయాన్ని అయితే కాదు! అసలు తెలుగుదేశం పార్టీతో పవన్ పొత్తు పెట్టుకోవడమే కేవలం జగన్ ను ఓడించి తీరాలనే తన అహంభావం తప్ప మరో రీజన్ ఇప్పటి వరకూ లేదు! తనకు గుండు కొట్టించినట్టుగా ప్రచారం చేశారు, తన తల్లిని తిట్టించారు.. అని లెక్కలేనన్ని సార్లు వాపోయి, జగన్ విషయంలో తనకు రేగిన అహాన్ని సంతృప్తి పరుచుకోవడానికి పవన్ రగిలిపోతున్నాడు, అదే అహంలో అర్థం లేని మాటలే మాట్లాడుతున్నాడు.
ప్రజాస్వామ్యంలో ఎవరిని గద్దెనెక్కించాలన్నా, పాతాళానికి దించాలన్నా.. అది ప్రజలు అనుకుంటే జరుగుతుంది కానీ, తను అనుకుంటే జరుగుతుందని, తన పొత్తుల వ్యూహాలతో జరగదని పవన్ కు 2024 ఎన్నికలు అర్థమయ్యేలా చేసి జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుకుందాం!