ప్రవన్ కాదు ప్రణయ్.. మధ్యలో దూరిన ఉస్మానియా

పవన్ కల్యాణ్ కి, రామ్ గోపాల్ వర్మకి మధ్య సినిమా గొడవ జరుగుతోంది. “పవర్ స్టార్” పేరుతో వర్మ సినిమా తీసి రేపు ఆన్ లైన్లో విడుదల చేస్తున్నాడు. దీని టైటిల్ నుంచి ట్రైలర్…

పవన్ కల్యాణ్ కి, రామ్ గోపాల్ వర్మకి మధ్య సినిమా గొడవ జరుగుతోంది. “పవర్ స్టార్” పేరుతో వర్మ సినిమా తీసి రేపు ఆన్ లైన్లో విడుదల చేస్తున్నాడు. దీని టైటిల్ నుంచి ట్రైలర్ వరకు ప్రతి వ్యవహారమూ పవన్ కల్యాణ్ తో పాటు అతడి అభిమానుల్ని గిచ్చేలా ఉంది. మెగా ఫ్యామిలీ కూడా ఈ ఇష్యూపై రగిలిపోతోంది కానీ బైటపడటంలేదు. బురదలో రాయి వేసి ఒళ్లంతా చేసుకోవడం ఎందుకని సైలెంట్ అయిపోయారు.

మెగాభిమానులు, జనసైనికులు కూడా అందుకే చూసీ చూడనట్టు ఉన్నారు. సినిమా గురించి ఎంత ఎక్కువ డిస్కస్ చేస్తే.. వర్మకి అంత ఎక్కువ లాభం అనేది కామన్ సెన్స్ ఉన్న అభిమానులందరూ గుర్తించారు. అయితే అనూహ్యంగా నిన్న వర్మ ఆఫీస్ పై దాడి జరగడం, దానికి వర్మ కౌంటర్ ఇవ్వడం, మధ్యలో టీవీ ఛానెళ్ల హడావిడి అంతా మనం చూశాం. అసలు వర్మ ఆఫీస్ పై దాడి చేసింది ఎవరు? జనసైనికులా? పవన్ ఫ్యాన్సా?

వీరెవరూ కాదట. ఓయూ జేఏసీ విద్యార్థి నాయకులట. వారు కూడా పవన్ కల్యాణ్ అభిమానులట. పవన్ వెర్షన్ నుంచి కాకుండా.. ప్రజలు, సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల్లోకి వర్మ తొంగి చూస్తున్నాడనే కోణంలో వర్మ ఆఫీస్ పై దాడి చేశారట. పైకి పవన్ కల్యాణ్ పేరు, పవర్ స్టార్ సినిమా విడుదల అనే కారణం చెబుతున్నా.. అసలు వ్యవహారం వేరే ఉందని ఓయూ వర్గాలంటున్నాయి.

అమృత, ప్రణయ్ ప్రేమ కథను వర్మ టచ్ చేయాలని చూడటం ఓయూలోని ఓ వర్గం విద్యార్థులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ప్రణయ్ తో నేరుగా పరిచయం లేకున్నా.. ప్రణయ్ లవ్ స్టోరీ, తదనంతర పరిణామాలతో ఆ కుటుంబంపై చాలామందికి సింపతీ పెరిగింది. అమృతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలామంది అండగా నిలిచారు. వారిలో ఓయూ విద్యార్థి సంఘ నేతలు కూడా ఉన్నారు.

వర్మ ఎప్పుడైతే వీరి ట్రాజెడీ ఎండింగ్ లవ్ స్టోరీని క్యాష్ గా మార్చుకోవాలనుకున్నాడో.. అప్పుడే ఆయన తెలంగాణ విద్యార్థి లోకానికి, ఓ వర్గానికి టార్గెట్ అయ్యారు. అయితే వారంతా సమయం కోసం ఎదురు చూశారంతే. పవన్ కల్యాణ్ ని కించపరుస్తూ వర్మ సినిమా తీస్తున్నారు కాబట్టి, ఇప్పుడు సహజంగానే గొడవలు జరిగే అవకాశముంది. అందులోనూ ప్రతి ఛానెల్ కి వెళ్లిమరీ వర్మ పవర్ స్టార్ ఫ్యాన్స్ ని కెలికేసి వస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఓయూ జేఏసీ విద్యార్థి విభాగం అని చెప్పుకుంటున్న కొందరు వర్మ ఆఫీస్ కి వచ్చారు. గందరగోళం సృష్టించి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. అయితే వర్మ దీన్ని తెలివిగా పవన్ ఫ్యాన్స్ కి అంటగట్టేసి తన సినిమాకి మరింత ప్రమోషన్ తెచ్చుకుంటున్నాడు.

వాస్తవానికి పవన్ కల్యాణ్ ఈ వ్యవహారంపై తన స్పందన తెలిపితే బాగుండేదని జన సైనికులు అభిప్రాయం. కనీసం మెగా బ్రదర్ అయినా తమకి మార్గనిర్దేశనం చేయాల్సి ఉందని వారి అభిప్రాయం. శ్రీరెడ్డి మాటలకే పవన్ కల్యాణ్ చిర్రెత్తిపోయి మా ఆఫీస్ కి రాలేదా. అక్కడికి నాగబాబు, అల్లు అర్జున్ వచ్చి సపోర్ట్ చేయలేదా.

మరిప్పుడు ఏకంగా పవర్ స్టార్ పేరుతో సినిమా తీస్తూ.. ట్రైలర్ లో భార్య, మాజీ భార్య, చిరంజీవి ప్రస్తావనని చూపిస్తూ.. వెటకారం చేస్తుంటే మెగాపౌరుషం ఎక్కడికి పోయిందని అడుగుతున్నారు అభిమానులు.

ఆర్జీవీకి సపోర్ట్ గా తరలి వచ్చిన ఫ్యాన్స్