పెళ్లి ఫొటోలు రిలీజ్ చేసిన హీరోయిన్

హీరో అర్జున్ కూతురు, ఐశ్వర్య అర్జున్ వివాహం నిన్న రాత్రి ఘనంగా జరిగింది. చెన్నైలో అర్జున్ నిర్మించిన హనుమాన్ ఆలయంలో ఈ పెళ్లి వేడుక ముగిసింది. ఈరోజు తన పెళ్లి ఫొటోల్ని రిలీజ్ చేసింది…

హీరో అర్జున్ కూతురు, ఐశ్వర్య అర్జున్ వివాహం నిన్న రాత్రి ఘనంగా జరిగింది. చెన్నైలో అర్జున్ నిర్మించిన హనుమాన్ ఆలయంలో ఈ పెళ్లి వేడుక ముగిసింది. ఈరోజు తన పెళ్లి ఫొటోల్ని రిలీజ్ చేసింది ఐశ్వర్య అర్జున్.

3 రోజుల ముందు నుంచి ఐశ్వర్య అర్జున్, ఉమాపతి పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. అర్జున్ ఇంట్లో ముందుగా హల్దీ ఫంక్షన్ నిర్వహించారు. ఆ తర్వాత మెహందీ ఫంక్షన్. సంగీత్ కూడా జరిగింది. ఈ వేడుకలో అనామిక ఖన్నా డిజైన్ చేసిన దుస్తుల్ని ధరించి, అందంగా కనిపించింది ఐశ్వర్య అర్జున్. ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం స్వయంగా అర్జున్, వ్యాఖ్యాతగా మారాడు.

ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ముగిసిన తర్వాత హనుమాన్ ఆలయంలో ఐశ్వర్య-ఉమాపతి పెళ్లి సంప్రదాయబద్ధంగా జరిగింది. పెళ్లిలో ఎరుపు రంగు పట్టుచీర కట్టుకుంది ఐశ్వర్య. ఈ పెళ్లికి కోలీవుడ్ కు చెందిన హీరోలు విశాల్, కార్తి హాజరయ్యారు. వీళ్లతో పాటు సముద్రఖని, కేఎస్ రవికుమార్, ఎస్ఆర్ ప్రభు, విజయ్ కుమార్ లాంటి ప్రముఖులు హాజరయ్యారు.

విశాల్ హీరోగా నటించిన సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది ఐశ్వర్య అర్జున్. అయితే కోలీవుడ్ లో ఆమె క్లిక్ అవ్వలేకపోయింది. దీంతో కూతుర్ని టాలీవుడ్ కు పరిచయం చేయాలనుకున్నాడు అర్జున్. ప్రముఖుల్ని పిలిచి సినిమా ఓపెనింగ్ ఫంక్షన్ గ్రాండ్ గా నిర్వహించాడు. అంతా ఓకే అనుకున్న టైమ్ లో హీరో విశ్వక్ సేన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. అక్కడితో ఈ సినిమా ఆగిపోయింది. ఐశ్వర్యకు పెళ్లయిపోయింది.

Click More Photos