జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ చేస్తున్న కొన్ని కామెంట్స్ టీడీపీ నేతలకు అసలు రుచించడం లేదు. ముఖ్యంగా లోకేశ్‌కు పవన్ మాటలు అసలు నచ్చడం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇది కక్ష తీర్చుకునే సమయం కాదని, ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పవన్‌కల్యాణ్ పదేపదే చెప్పడంపై లోకేశ్, ఆయన వర్గీయులు ఆగ్రహంగా ఉన్నారని తెలిసింది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వేధించిన నాయకులు, అధికారుల గురించి రెడ్ బుక్‌లో రాశారని, ఇప్పుడు వారి భరతం పట్టే సమయం ఆసన్నమైందనేది టీడీపీ నేతల వాదన. కానీ మిత్రపక్షమైన జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ మాత్రం అలాంటి వాటికి చెక్ పెట్టాలని హితవు చెప్పడం ఏం బాగోలేదని టీడీపీ నేతలు అంటున్నారు. ఇలాగైతే అధికారం దక్కించుకున్నా ప్రయోజనం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.
అయితే ఇక్కడ ఇంకో విషయం వుంది. కక్షపూరిత చర్యలను పవన్‌కల్యాణ్ ఒక వైపు తప్పు పడుతుంటే, మరోవైపు టీడీపీ నాయకులు, అక్కడక్కడ జనసేన నేతలు కూడా ప్రత్యర్థులపై దాడులకు తెగబడుతున్నారు.
టీడీపీని కాసేపు పక్కన పెడితే, తన పార్టీ నాయకులు కక్ష తీర్చుకునేందుకు బరి తెగిస్తున్నారని పవన్‌కు తెలియకపోవడం విడ్డూరంగా వుందని వైసీపీ నేతలు అంటున్నారు. క్షేత్రస్థాయిలో టీడీపీకి తామేం తక్కువ కాదంటూ జనసేన నాయకులు కూడా అరాచకానికి పాల్పడుతుండడం నిజం. పవన్ ముందుగా తన వాళ్లను అదుపులో పెడితే, ఆ తర్వాత టీడీపీ నేతలకు వార్నింగ్ ఇవ్వొచ్చు.