Advertisement

Advertisement


Home > Movies - Movie News

వేణుస్వామితో నిధి అగ‌ర్వాల్ పూజ‌లు!

వేణుస్వామితో నిధి అగ‌ర్వాల్ పూజ‌లు!

టాలీవుడ్ సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కుల జాత‌కాలు చెబుతూ పాపుల‌రైన వేణుస్వామి మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. తాజాగా వేణుస్వామితో హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ త‌న ఇంట్లో పూజ‌లు, యాగం చేయించిన వీడియో వైర‌ల్ అవుతోంది. సినిమా ఇండ‌స్ట్రీలో మంచి అవ‌కాశాలు కోసం ఆమె రాజ శ్యామ‌ల పూజ చేయించిన‌ట్లు తెలుస్తోంది.

స‌వ్య‌సాచి, ఇస్మార్డ్ శంక‌ర్ చిత్రాల్లో న‌టించి టాలీవుడ్ లో మంచి పేరు సంపాధించుకుంది. కాగా వేణు స్వామి గతంలో కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేయడం ద్వారా ఫేమస్ అయ్యారు. నాగ చైతన్య-సమంత విడాకులు గురించి ఆయన ముందే చెప్పారు. అలాగే ఇటీవల రకుల్ తన ప్రియుడు జక్కీ భగ్నానీ గురించి రివీల్ చేశారు.

గ‌తంలో హీరోయిన్ ర‌ష్మిక కూడా వేణుస్వామితో పూజ‌లు చేయించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. కాగా నిధి అగ‌ర్వాల్ ప్ర‌స్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో న‌టిస్తోంది. హరిహర వీరమల్లు సినిమా త‌ర్వాత త‌న‌కు మంచి ఆవ‌కాశ‌లు వ‌స్తాయ‌ని భావిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?