హీరోయిన్లు చెప్పే కబుర్లు ఒక్కోసారి భలే గమ్మత్తుగా ఉంటాయి. పెళ్లి విషయంలో, సినిమా అవకాశాలు తగ్గినప్పుడు, గ్లామర్ తగ్గినప్పుడు వాళ్లు చెప్పే కహానీలు కామెడీ పండిస్తుంటాయి. ఇప్పుడు నిధి అగర్వాల్ కూడా ఇలాంటి కామెడీనే పండించింది. హిందీ ఆడియన్స్ ఆమెను రారమ్మని పిలుస్తున్నారట. బాలీవుడ్ లో సినిమా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారట.
హిందీ సినిమాతోనే డెబ్యూ ఇచ్చింది నిధి అగర్వాల్. కానీ అదక్కడ పెద్దగా ఆడలేదు. దీంతో అన్నీ సర్దుకొని సౌత్ కు వచ్చేసింది. సవ్యసాచి నుంచి మొదలుపెడితే, హరిహర వీరమల్లు సినిమా వరకు ఏళ్లుగా తెలుగు-తమిళ సినిమాలు మాత్రమే చేస్తూ వస్తోంది.
ఇలాంటి టైమ్ లో ఊహించని విధంగా ఓ హిందీ ప్రైవేట్ ఆల్బమ్ లో నటించే అవకాశం దక్కింది. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. బాలీవుడ్ ప్రేక్షకులు తనను హిందీ సినిమాలు చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారంటూ చెప్పుకొచ్చింది.
“చాలా మంది నార్త్ ప్రేక్షకులు నన్ను కలుస్తున్నారు. బాలీవుడ్ లో సినిమా చేయమని అడుగుతున్నారు. దీనికి సంబంధించి నాకు చాలా మెసేజీలు, కామెంట్లు కూడా వచ్చాయి. బహుశా.. నేను హిందీలో సినిమా చేయడానికి ఇదే సరైన సమయం అనుకుంటా.”
ఇలా తన బాలీవుడ్ రీఎంట్రీపై స్పందించింది నిధి అగర్వాల్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పవన్ కల్యాణ్ సరసన హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తోంది. దీంతో పాటు హీరో అనే మరో సినిమా కూడా రిలీజ్ కు రెడీ అయింది.