మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం పూర్తి

మెగా డాటర్, నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్థం పూర్తయింది. గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ చైతన్య, నిహారిక పరస్పరం ఉంగరాలు మార్చుకున్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీకి సమీపంలో ఉన్న ట్రైడెంట్ హోటల్ లో ఈ ఎంగేజ్…

మెగా డాటర్, నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్థం పూర్తయింది. గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ చైతన్య, నిహారిక పరస్పరం ఉంగరాలు మార్చుకున్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీకి సమీపంలో ఉన్న ట్రైడెంట్ హోటల్ లో ఈ ఎంగేజ్ మెంట్ జరిగింది.

ఈ నిశ్చితార్థ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం కదిలొచ్చింది. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయితేజ్, వైష్ణవ్ తేజ్, కల్యాణ్ దేవ్.. ఇలా మెగా హీరోలంతా ఈ నిశ్చితార్థ వేడుకలో కనిపించారు. లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా అతి తక్కువ మంది బంధువుల సమక్షంలో ఈ ఎంగేజ్ మెంట్ జరిగింది.

నిహారిక-చైతన్య పెళ్లిని డిసెంబర్ లో చేయాలని నాగబాబు నిర్ణయించారు. హైదరాబాద్ లోనే వివాహం జరుగుతుంది. 

టిడిపిని ద్వంసం చేసి, ఆ పునాదులపై ఎదగాలని