ఏపీ హైకోర్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పాలు పోసిందనే చెప్పాలి. మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి తాజాగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో గత నెలలో హైకోర్టు మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని రమేశ్ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించడం ఒక రకంగా జగన్‌కు పరోక్షంగా ఎంతో మేలు చేసిందనే అభిప్రాయాలు పెద్ద ఎత్తున వ్యక్తమవు తున్నాయి.
ఒకవేళ అచ్చెన్నాయుడు విజయవాడ సబ్‌జైల్లోనే ఉండి, కరోనా బారిన పడి ఉంటే…టీడీపీ రాజకీయాలు ఎలా ఉండేవో ఊహిం చుకుంటే కంపరం పుడుతుందని పలువురు అంటున్నారు. జగన్ సర్కార్ కావాలనే అచ్చెన్నాయుడికి కరోనా అంటించిందని పెద్ద ఎత్తున టీడీపీ , ఎల్లో మీడియా దుష్ప్రచారం చేసేవంటున్నారు. అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్ రావడం కూడా బీసీలపై దాడి అని చిత్రీకరించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని వాటి స్వభావం తెలిసిన వారంటున్నారు.
గుంటూరు గవర్నమెంట్ ఆస్పత్రిలో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నఅచ్చెన్నాయుడిని పోలీసులు విజయవాడ సబ్‌జైలుకు గత నెలలో తరలించారు. అయితే ఫైల్స్ తో బాధపడుతున్న తనకు రెండుసార్లు ఆపరేషన్ చేశారని, ఇంకా కోలుకోవాల్సి ఉందని, కావున సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రిలో చికిత్స తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ అచ్చెన్నా యుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు అచ్చెన్నకు అనుకూలంగా తీర్పు చెప్పింది. దీంతో ఆయన్ను టీడీపీ నేతకు చెందిన గుంటూరు రమేశ్ ఆస్పత్రికి తరలించారు. తమ పార్టీకి చెందిన ఆస్పత్రి కావడంతో అచ్చెన్న కోరి మరీ అక్కడికి వెళ్లారు. గత నెల 8వ తేదీ నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు.
ఈ నేపథ్యంలో నిన్న ఉదయం నుంచి జలుబుతో బాధపడుతున్న అచ్చెన్నకు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఆయనకు కరోనా ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రికి తరలించేందుకు అనుమతి కోరడం, అందుకు హైకోర్టు సానుకూలంగా స్పందించడం జగన్ సర్కార్‌కు మంచే జరిగిందంటున్నారు. కోరి కోరి చేరిస ఆస్పత్రిలో కరోనా రావడంతో టీడీపీ, ఎల్లో మీడియాకు జగన్ సర్కార్‌పై నిందలు వేసే సువర్ణావకాశం తప్పినట్టైంది.