మెగా కాంపౌండ్ సభ్యులంతా ఎప్పుడూ కలిసే ఉంటారు. ఏ పండగొచ్చినా కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ నిహారిక మాత్రం కాంపౌండ్ నుంచి దూరంగా జరిగింది. ఒంటరిగా ఉంటోంది. ఈ విషయాన్ని తనే స్వయంగా బయటపెట్టింది.
“నేను ఇప్పుడు మా నాన్న ఇంట్లో ఉండడం లేదు, మా మామగారి ఇంట్లో కూడా ఉండడం లేదు. నేను, నా భర్త విడిగా ఉంటున్నాం. దగ్గరవాళ్లు ఎవ్వరూ లేరు. కొన్ని రోజులు మేమిద్దరమే ఉండాలని నిర్ణయించుకున్నాం. పుట్టినప్పట్నుంచి ఇప్పటివరకు నన్ను సింగిల్ గా ఉండనీయలేదు. హాస్టల్ లేదు. కనీసం ట్రిప్ కు కూడా 3 రోజులకు మించి పంపించ లేదు. సో.. పెళ్లయింది, కనీసం ఇప్పుడైనా కొన్ని రోజులు ఫ్రీగా ఉంటాం, వదిలేయండని బయటకు వచ్చేశాం.”
ఇలా భర్తతో కలిసి సెపరేట్ గా ఉంటున్న విషయాన్ని బయటపెట్టింది నిహారిక. కెరీర్ విషయానికొస్తే, సినిమాల కంటే ఓటీటీపై ఇప్పుడు ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలిపింది నిహారిక. నటిగా, నిర్మాతగా కొనసాగుతానని స్పష్టంచేసింది.
“ప్రస్తుతం నిర్మాతగా ఓ చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేశాను. అది స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇక నేను నటిగా ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను. ది బెస్ట్ టీమ్ తో వర్క్ చేస్తున్నాను. త్వరలోనే ఆ డీటెయిల్స్ చెబుతా.”
పెళ్లి తర్వాత కూడా సమంత, కాజల్ సినిమాల్లో కొనసాగుతున్నారని.. అదే విధంగా తను కూడా సినిమాలు, ఓటీటీ లో కొనసాగుతానని స్పష్టంచేసింది నిహారిక. భర్త అంగీకారంతోనే పెళ్లి తర్వాత కూడా నటిస్తున్నానని అంటోన్న ఈ మెగా డాటర్… తన భర్త, అన్న వరుణ్ తేజ్ చిన్నప్పుడు క్లాస్ మేట్స్ అనే విషయాన్ని కూడా బయటపెట్టింది.