తన భార్య గర్భవతి అనే విషయాన్ని హీరో నిఖిల్ స్వయంగా ప్రకటించాడు ఆమధ్య. ఇప్పుడు తండ్రి అయ్యాడు. ఈరోజు పల్లవి వర్మ, మగ బిడ్డకు జన్మనిచ్చింది. తనకు కొడుకు పుట్టిన విషయాన్ని నిఖిల్ ప్రకటించాడు. కొడుకును తొలిసారి ముద్దాడిన ఫొటోను కూడా రిలీజ్ చేశాడు.
నిఖిల్ కు మాయ అనే పేరు చాలా ఇష్టం అంట. అందుకే పల్లవితో డేటింగ్ స్టార్ట్ చేసిన 15-20 రోజులకే ఈ విషయంపై ఆమెతో డిస్కస్ చేశాడట. “నా కూతురు పేరు మాయ, నీకు ఓకేనా” అంటూ అప్పుడే ఆ విషయాన్ని డైరక్ట్ గా అడిగేశాడట.
కూతురు పుడితే మాయ పేరు పెట్టాలని అనుకున్నాడు. కానీ కొడుకు పుట్టాడు. త్వరలోనే కొడుకు పేరును వెల్లడిస్తానంటున్నాడు ఈ హీరో.
ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా నిఖిల్ కు పల్లవితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. పల్లవిని గోవాకు తీసుకెళ్లి మరీ అందంగా తన ప్రేమను ప్రపోజ్ చేశాడు నిఖిల్. ఆ తర్వాత కొన్ని రోజులకే ఇద్దరూ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కాకపోతే కరోనా టైమ్ కావడం వల్ల వీళ్ల పెళ్లి సింపుల్ గా జరిగిపోయింది.