నైజాంలో కొత్త పంపిణీ సంస్థ

నైజాంలో థియేటర్ల వ్యాపారం మీద పట్టు వున్న ఆసియన్ సినిమాస్ సంస్థ నుంచి మరో కొత్త సంస్ధ పుట్టింది. ఆసియన్ సినిమాస్ అంటే సురేష్ బాబు-సునీల్ నారంగ్, ఇంకా మరో ఒకరిద్దరు భాగస్వామలు వున్నారు.…

నైజాంలో థియేటర్ల వ్యాపారం మీద పట్టు వున్న ఆసియన్ సినిమాస్ సంస్థ నుంచి మరో కొత్త సంస్ధ పుట్టింది. ఆసియన్ సినిమాస్ అంటే సురేష్ బాబు-సునీల్ నారంగ్, ఇంకా మరో ఒకరిద్దరు భాగస్వామలు వున్నారు. అలాగే ఆసియన్ గ్లోబల్ అంటే టాలీవుడ్ లోని కొంత మంది నిర్మాతలు, ఆసియన్ సునీల్, సురేష్ బాబు భాగస్వామలుగా వున్నారు. ఇంకా చాలా సంస్థలు వున్నాయి ఆసియన్ నుంచే. ఇప్పుడు మరో కొత్త సంస్థ వచ్చింది. అదే ఆసియన్ సురేష్.

ఈ సంస్థ సినిమాల నిర్మాణం, పంపిణీ రెండూ చేసే ఆలోచనతో పుట్టింది. కేవలం ఇద్దరే భాగస్వాములు. సురేష్ బాబు-ఆసియన్ సునీల్. ఈ సంస్థ నుంచి తొలి సినిమాగా ఇండియన్ 2 వస్తోంది. ఇండియన్ 2 ను నైజాం, ఆంధ్ర (సీడెడ్ కాకుండా) ఏరియాల పంపిణీకి ఈ రోజ ఒప్పందం కుదిరింది. ఆసియన్ సునీల్, సురేష్ బాబుది ఒకటే పాలసీ. 99 శాతం వరకు సినిమాలను కేవలం అడ్వాన్స్ ల మీద పంపిణీ చేయాలి. అంతే తప్ప నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ లు ఇచ్చి వ్యాపారం చేయకూడదు.

ఇప్పుడు ఈ ఇండియన్ 2 సినిమాను కూడా అలాగే కాస్త పెద్ద మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చి కేవలం పంపీణీ ప్రాతిపదిక మీద తీసుకున్నారు. లైకా సంస్థ నుంచి వరుసగా సినిమాలు వున్నాయి కనుక ఎంత అడ్వాన్స్ ఇచ్చినా ఎక్కడికీ పోదనే భరోసా వుంది. త్వరలో మరి కొన్ని సినిమాల పంపిణీ, ఓ సినిమా నిర్మాణం కూడా ఈ కొత్త సంస్థ చేయబోతోంది.