ప్రేక్షకుల కోసం సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. ఇందులో ఫ్యాన్స్ కూడా ఉంటారు. కానీ కొన్ని సినిమాల్ని ఓటీటీ ఆబ్లిగేషన్ కోసం విడుదల చేస్తుంటారు. ఈ కోవలో చాలా చిన్న సినిమాలు తగుల్తుంటాయి. కానీ నిఖిల్ లాంటి హీరో సినిమా కూడా ఈ లిస్ట్ లోకి చేరిపోయింది.
“అప్పుడో ఇప్పుడు ఎప్పుడో”.. నిఖిల్ హీరోగా నటించిన సినిమా ఇది. దాదాపు మూడేళ్ల కిందటే రెడీ అయిన ఈ సినిమా సడెన్ గా ఊడిపడింది. ఇలా విడుదల తేదీ ప్రకటించి.. అలా రిలీజ్ చేస్తున్నారు. ప్రాపర్ గా ప్రమోషన్ కూడా చేయకుండానే ఈరోజు థియేటర్లలోకి వదిలారు సినిమాను. కేవలం ఓటీటీ జనం కోసం ఇలా చేయాల్సి వచ్చిందంటున్నాడు దర్శకుడు సుధీర్ వర్మ.
“ఓటీటీ కోసమే ఈ సినిమాను ఇంత ఫాస్ట్ గా రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు మిస్సయితే మళ్లీ డేట్ లేదు. అమెజాన్ వాళ్లు నెలకు ఓ సినిమా పెట్టుకుంటున్నారు. అలా చూసుకుంటే, ఏప్రిల్-మే వరకు మా సినిమాకు స్లాట్ లేదు. వాళ్లు డిసెంబర్ చివరి నాటికి రిలీజ్ చేయాలని అడిగారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాను విడుదల చేస్తున్నాం.”
తెలుగు సినిమా ఓటీటీ కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోతుందనడానికి మరో ఉదాహరణగా నిలిచింది నిఖిల్ సినిమా. నిజానికి ప్రస్తుతం హీరోకున్న క్రేజ్ కు, ఈ సినిమాలో ఉన్న హీరోయిన్లు, దర్శకుడు-హీరో కాంబినేషన్ కు కాస్త బజ్ తో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది. కానీ అమెజాన్ వాళ్లు అడిగారని ఇలా హడావుడిగా రిలీజ్ చేసేశారు.
సరైన ప్రచారం లేకుండా విడుదల చేసిన ఫలితం మొదటి రోజే కనిపించింది. “అప్పుడో ఇప్పుడు ఎప్పుడో” సినిమాకు ఎలాంటి ఓపెనింగ్స్ కనిపించడం లేదు. చాలామందికి ఈ సినిమా ఈరోజు రిలీజైనట్టు కూడా తెలియదు. తెలిసినవాళ్లు లైట్ తీసుకున్నారు.
2 గంటల నిడివి గల ఈ సినిమా నిలబడాలంటే ఇక పూర్తిగా మౌత్ టాక్ పై ఆధారపడాల్సిందే. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా, ఫ్లాప్ టాక్ వచ్చినా, అగ్రిమెంట్ ప్రకారం అతికొద్ది రోజుల్లోనే అమెజాన్ లో సినిమా ప్రత్యక్షమవ్వడం ఖాయం. ఎందుకంటే, వాళ్ల కోసమే ఈ సినిమాను ఇంత తొందరగా థియేటర్లలో రిలీజ్ చేశారు కాబట్టి.
Call boy jobs available 9989793850
Call boy works 9989793850
vc available 9380537747
డైరెక్ట్ ఓటిటిలోనే రిలీజ్ చెయ్యాలి
చాలా మంచి పరిణామం