బన్నీ నిర్ణయం వెనుక అ దర్శకుడు?

బన్నీతో సన్నిహితంగా వున్న దర్శకుడు ఒకరు దీనిని మరింత ఎగసం తోసారనే గ్యాసిప్ టాలీవుడ్ లో వినిపిస్తోంది.

భారీ పాన్ ఇండియా సినిమా. 1000 కోట్ల మేరకు మార్కెటింగ్. చాలా అంటే చాలా ప్రెస్టేజియస్ సినిమా. ఈ సినిమా నుంచి తప్పించేయడం అంటే అంతకన్నా అవమానం మరోటి వుండదు. అలాంటిది జరిగింది సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ కు. ఇది ఎవ్వరూ ఊహించనది.

దేవీతో దర్శకుడు సుకుమార్ కు అనుబంధం ఇవ్వాళ నిన్నటిది కాదు. సుకుమార్ ప్రతి సినిమా దేవీ కి స్పెషల్. దేవీ-సుకుమార్ కలిసి ఓ సినిమా నిర్మించారు కూడా. దేవీ లేకుండా సుకుమార్ సినిమా లేదు.

కానీ మరి దేవీ ఎంత నిర్లక్ష్యం చేసినా, పుష్ప 2 నుంచి ఎందుకు తప్పించారు? విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ఈ నిర్ణయం దర్శకుడు సుకుమార్ తీసుకోలేదు. హీరో బన్నీ తీసుకున్నారు. పుష్ప 2 ఫస్ట్ పార్ట్ లాక్ చేసి అర్ అర్ కు ఇచ్చేసారు. అది తన దగ్గర పెట్టుకుని, వర్క్ చేయకుండా దేవీ తన స్టేజ్ షో ల మీదకు వెళ్లడం అన్నది హీరో బన్నీ కోపానికి కారణం అయింది.

అదే సమయంలో బన్నీతో సన్నిహితంగా వున్న దర్శకుడు ఒకరు దీనిని మరింత ఎగసం తోసారనే గ్యాసిప్ టాలీవుడ్ లో వినిపిస్తోంది. షో లు ముఖ్యంగా, మీ సినిమా ముఖ్యమా అనే విధంగా ఎగసందోయడం, అదే టైమ్ లో సినిమా రిలీజ్ టెన్షన్ వుండడంతో హీరో కి అ మాటలు బాగా ఎక్కేసినట్లున్నాయి.

దీంతో ఆర్ అర్ వర్క్ వేరే ముగ్గురు సంగీత దర్శకులకు అప్పగించేలా ఏర్పాటు జరిగిపోయింది. ఇక్కడ సుకుమార్ కూడా దేవీని వెనకేసుకు రాలేని పరిస్థితి. నిజానికి ఇది అంత అకస్మాత్తుగా జరిగిపోయింది కాదు. కొన్ని రోజులుగా నడుస్తోంది. ఈ సంగతి తెలిసి దేవీశ్రీప్రసాద్ వచ్చి నేరుగా సుకుమార్ ను కలిసి మాట్లాడి వెళ్లినట్లు తెలుస్తోంది. కానీ సుకుమార్ తన అసక్తత వ్యక్తం చేయడంతో మాట్లాడకుండా వెళ్లిపోయారని తెలుస్తోంది

ఒకటి వాస్తవం.. ఇక ముందు కూడా సుకుమార్-దేవీ బంధం విడిపోయే అవకాశం చాలా తక్కువ. తరువాత రాబోయే రామ్ చరణ్-సుకుమార్ సినిమాకు దేవీనే పని చేసే అవకాశం ఎక్కువగా వుంది. కానీ బన్నీ-దేవీ బంధం తెగిపోయినట్లే అనుకోవాలి.

21 Replies to “బన్నీ నిర్ణయం వెనుక అ దర్శకుడు?”

    1. సినిమా హిట్ అయితే దేవిశ్రీ ప్రసాద్ కి నష్టం, మ్యూజిక్ఫ్లా కారణంగా ఫ్లాప్ అయితే నిర్మాతకి మరియు బన్నీకి నష్టం

  1. 1000 కోట్ల బిజినెస్ జరిగింది .. పై ఖర్చులు పోను 1200+ కోట్లు వస్తేనే బ్రేక్ ఈవెన్ అయినట్లు.. 1500 కోట్లకి పైగా అస్తేనే లాభాలు వచ్చినట్లు.

    500-600 దగ్గర ఆగిపోతే అడుక్కుతింటారు డిస్ట్రిబ్యూటర్లు..

    అయ్య దొడ్డిదారిన నేషనల్ అవార్డ్ తెచ్చిననంత సులువు కాదు.

    అసలే పవన్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు

  2. పవన్ ఫ్యాన్స్ ఉన్నది ముఖ్యంగా కేవలం తెలుగులోనే! అదీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులవలన ఆ సంఖ్య కాస్త చాలా వరకూ తగ్గిన దాఖలాలు సుస్ఫష్ఠం. అదే బన్నీకి సమకాలీన పరిస్థితులలో దేశ వ్యాప్తంగా చేకూరిన ఫ్యాన్ బేస్, దక్షిణాది నుంచి ఉతరాది వరకు వివిధ రాష్ట్రాలలో వ్యాపించి ఉంది. ఇది నిజం, పవన్ వీరాభిమానులు జీర్ణించుకోలేని, అంగీకరించలేని నిజం! నటనలో తన పరిపక్వతను సమకాలీన సినిమాలద్వారా నిరూపించుకుని తెలుగు లోని బెస్ట్ యాక్టర్స్ లైన్లో ముందు నిల్చొని ఉన్నాడు అల్లు అర్జున్! ఇది ఎవరు ఒప్పుకోకపోయినా… నిజం! ఒకవేళ పవన్ వీరాభిమానులు తెలుగు రాష్ట్రాలలో అల్లు వారి సినిమాలని ఇబ్బంది పెట్టవచ్చు ఏమో కానీ, ఇతర చోట్లా ఏమీ చేయలేరు, తన ప్రస్థానాన్ని ఆపలేరు!

    1. ఓహో అలాగా ఓహో. ఇంకేం అయితే మన నీలి పార్టీ కి తీసుకొని సిఎం ఇచ్చేయండి

    2. Cinema బాగుంటే ఎవడూ ఏమీ చేయలేడు. ఏమాత్రం ఏవరేజ్ టాక్ వచ్చినా… సినిమా బజ్జున్నట్టే

  3. ఆ దర్శకుడుకి దేవీ తో ఉన్న తీపి గుర్తులు ఏమిటో, దానికి కారణం ఏమిటో!

    1. ఎవడూ ఎవడికీ హిట్స్ ఇవ్వడు. వాడి సర్వైవల్ కోసం వాడు మంచి సాంగ్స్ ఇద్దాం అనుకుంటాడు. అవి కొన్నిసార్లు క్లిక్ అవుతాయి. కొన్నిసార్లు పోతాయి. ఇక మ్యూజికల్ హిట్స్ ఇచ్చారు దేవి అంటున్నారు. కానీ బన్నీ గారు దేవి గారికి అవకాశం ఇచ్చారు. Ofcourse అదేదో ధర్మంగా కాదులెండి. తనకి హెల్ప్ అవుతుందని ఇచ్చారు.

Comments are closed.