నితిన్ అండ్ కో సుడి బాగుంది

ఆస్ట్రేలియా డిస్ట్రిబ్యూటర్ వెంకట్, హీరో నాని మేనేజర్ వెంకట్, హీరో నితిన్ తండ్రి సుధాకరరెడ్డి, నిర్మాత టాగోర్ మధు కలిసి ‘విక్రమ్’ సినిమా తెలుగు హక్కులు ఆరు కోట్లకు కొన్నారు.  Advertisement ఆంధ్ర, సీడెడ్…

ఆస్ట్రేలియా డిస్ట్రిబ్యూటర్ వెంకట్, హీరో నాని మేనేజర్ వెంకట్, హీరో నితిన్ తండ్రి సుధాకరరెడ్డి, నిర్మాత టాగోర్ మధు కలిసి ‘విక్రమ్’ సినిమా తెలుగు హక్కులు ఆరు కోట్లకు కొన్నారు. 

ఆంధ్ర, సీడెడ్ అయిదు కోట్లకు అమ్మేసి నైజాం కోటి రూపాయలకు స్వంత డిస్ట్రిబ్యూషన్ కు వుంచుకున్నారు. జస్ట్ అయిదుశాతం కమిషన్ కు ఎటువంటి అడ్వాన్స్ లేకుండా డిస్ట్రిబ్యూషన్ కు దిల్ రాజు చేతిలో పెట్టారు.

పస్ట్ వీకెండ్ కే రెండు కోట్లు దాటి షేర్ వస్తోంది. టోటల్ రన్ లో అయిదు కోట్లు చేస్తుందని అంచనా వేస్తున్నారు. అంటే నలుగురు బయ్యర్లకు తలో కోటి రూపాయలు మిగిలేలా కనిపిస్తోంది. అంటే ఒక్కొక్కరికి పెట్టిన కోటిన్నర పెట్టుబడికి కోటి లాభం అన్నమాట. 

నిజానికి ఈ సినిమా చాలా అంటే చాలా లాస్ట్ మినిట్ లో బిజినెస్ అయ్యింది. అప్పుడు కాస్త ధైర్యం చేసి ఆరు కోట్లకు నలుగురూ కలిసి కొనుగోలు చేసారు.

ఆంధ్ర నాలుగు కోట్ల రేషియోలో అమ్మారు. అందువల్ల పెద్దగా సమస్య లేకుండానే బయ్యర్లు బ్రేక్ ఈవెన్ అయ్యే సూచనలు క్లియర్ గా కనిపిస్తోంది. 

ఉత్తరాంధ్ర ఖర్చులతో కలిపి 95 లక్షలకు కొన్నారు. అక్కడ మూడు రోజులకే 80 లక్షల వరకు వస్తోంది. మొత్తం మీద చాలా రోజుల తరువాత ఓ డబ్బింగ్ సినిమా వల్ల బయ్యర్లు లాభాలు కళ్ల జూసే అవకాశం కనిపిస్తోంది.