పర్యావరణం అంటే టీడీపీకి అది గుర్తుకొచ్చింది…?

ప్రపంచ పర్యావరణ దినోత్సవం అంటే మొక్కలు నాటడం, ర్యాలీలు చేయడం అందరూ చేస్తున్న వేళ విశాఖ టీడీపీకి మాత్రం రుషికొండ గుర్తుకువచ్చింది. అంతే అక్కడకి వెళ్ళి మరీ నిరసన చేపట్టింది. మానవహారం పేరిట హడావుడి…

ప్రపంచ పర్యావరణ దినోత్సవం అంటే మొక్కలు నాటడం, ర్యాలీలు చేయడం అందరూ చేస్తున్న వేళ విశాఖ టీడీపీకి మాత్రం రుషికొండ గుర్తుకువచ్చింది. అంతే అక్కడకి వెళ్ళి మరీ నిరసన చేపట్టింది. మానవహారం పేరిట హడావుడి చేసింది.

ఇంతకీ రుషికొండకూ పర్యావరణానికి లింక్ ఏంటి అంటే అక్కడ అక్రమ తవ్వకలు జరుగుతున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. దీని మీద ఇటీవల సుప్రీం కోర్టుకు వెళ్ళిన రాష్ట్ర ప్రభుత్వానికి పాత హొటల్ స్థానంలో నిర్మాణాలు చేసుకోవచ్చు అని వెసులుబాటు వచ్చింది.

ఇక తవ్వకాలు అన్నీ కూడా పర్యావరణానికి లోబడి చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ఈ వివాదం అలా న్యాయ సమీక్షలో ఉండగానే టీడీపీ మాత్రం రుషికొండను కొట్టేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోంది.

దీని మీద వైసీపీ నేతలు అయితే గట్టిగానే రిటార్ట్ ఇస్తున్నారు. అమరావతి రాజధాని పేరిట పచ్చని పొలాలను బీడుగా మార్చి కాంక్రీట్ జంగిల్స్ నిర్మించాలనుకున్నపుడు పర్యావరణం గుర్తుకు రాలేదా అని నిలదీస్తున్నారు. 

పర్యావరణ పరిధిలోనే నిర్మాణాలు చేస్తూంటే అడ్డుకోవాలని చూడడం లో అక్కసు తప్ప మరేమీ లేదని అంటోంది. మొత్తానికి టీడీపీ పర్యావరణ దినోత్సవం పేరిట రాజకీయం చేస్తోందని అంటున్నారు.