నితిన్ సినిమా 60శాతం పూర్తి

టాలెంటెడ్ యాక్ట‌ర్ నితిన్, బ్యూటీ డాల్ శ్రీలీల హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మేన్‌’. రైట‌ర్ – డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. సినిమా…

టాలెంటెడ్ యాక్ట‌ర్ నితిన్, బ్యూటీ డాల్ శ్రీలీల హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మేన్‌’. రైట‌ర్ – డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇప్ప‌టికే 60 శాతం షూటింగ్ పూర్త‌య్యింది.

హేరస్ జైరాజ్ సంగీతం సారథ్యం వహిస్తోన్న ఈ మూవీ నుంచి రీసెంట్‌గా ‘డేంజ‌ర్ పిల్లా..’ అనే లిరికల్ సాంగ్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్‌తో ఈ మ్యాజిక‌ల్ మెలోడీ సాంగ్‌కి కోటికి పైగా వ్యూస్ వ‌చ్చింది. పాట విన్న వాళ్లు, దానికి వ‌స్తోన్న‌రెస్పాన్స్‌ను గ‌మ‌నిస్తున్న‌వాళ్లు హారిస్ జైరాజ్ ఈజ్ బ్యాక్ అని అంటున్నారు. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ సినిమా నుంచి త్వ‌ర‌లోనే మ‌రో పాట‌ను విడుద‌ల చేయ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు. మ్యూజిక్ ల‌వ‌ర్స్ సైతం ఈపాట కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

నితిన్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి పాత్ర‌లో ఆకట్టుకోబోతున్నారు. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమా అన్ని వ‌ర్గాల వారిని మెప్పిస్తుంద‌ని వ‌క్కంతం వంశీ చెబుతున్నారు. మ్యూజిక‌ల్ జీనియ‌స్ హారిస్ జైరాజ్ సంగీతం సినిమా ఎక్స్‌ట్రా ఎసెట్ అవుతుంది. శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య‌మూవీస్ & ఎంట‌ర్ టైన్‌మెంట్స్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్స్‌పై సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

డిసెంబ‌ర్ 23న వ‌రల్డ్ వైడ్‌గా భారీ రేంజ్‌లో విడుద‌ల‌వుతున్న ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలిపారు.