టేబుల్ ప్రాఫిట్ ఎలా సాధ్యం సత్తారూ?

గాండీవధారి అర్జున సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా జస్ట్ 35 కోట్లలో తీసేసానని, నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్ అని అంటున్నారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. కానీ నిర్మాత సన్నిహిత వర్గాలు మాత్రం దర్శకుడి మాటల…

గాండీవధారి అర్జున సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా జస్ట్ 35 కోట్లలో తీసేసానని, నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్ అని అంటున్నారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. కానీ నిర్మాత సన్నిహిత వర్గాలు మాత్రం దర్శకుడి మాటల విషయంలో మండి పడుతున్నాయి. సినిమా షూట్ చేసిన టైమ్ నే దర్శకుడు లెక్కలు కడుతున్నారని, రెండు.. మూడేళ్ల కాలం సెట్ మీద వున్న విషయాన్ని, ఆ కాలం అంతటికీ పెట్టుబడికి వడ్డీలు కట్టిన సంగతిని ఎలా విస్మరిస్తారని ప్రశ్నిస్తున్నారు.

సినిమాకు వరుణ్ తేజ్‌కు 9 కోట్ల రెమ్యూనిరేషన్ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. సినిమా లొకేషన్ల రెక్కీ కే బోలెడు ఖర్చు చేసారని నిర్మాత సన్నిహిత వర్గాలు తెలిపాయి. సినిమాకు 55 కోట్ల మేరకు ఖర్చయితే, లేక ప్రవీణ్ సత్తారు చెబుతున్నట్లు 35 కోట్ల మేరకే ఖర్చయిందా అన్న డిస్కషన్ పక్కన పెడితే ఇప్పటి వరకు ఇంకా శాటిలైట్ కాలేదు. కేవలం హిందీ, డిజిటల్ మాత్రమే అమ్ముడయ్యాయి. శాటిలైట్ కూడా అమ్ముడైతే 26 కోట్ల వరకు రికవరీ వస్తుందని అంచనా.

పోనీ ప్రవీణ్ సత్తారు లెక్కలే నిజం అని అనుకుంటే, మరో పది కోట్ల వరకు రావాల్సి వుంది థియేటర్ మీద నుంచి. కానీ విశాఖ-గుంటూరు కలిపి నాలుగు కోట్లకు కొంటా అని మాట ఇచ్చిన బయ్యర్ లాస్ట్ మినిట్ లో వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. ఆఖరికి కోటిన్నర తీసుకుని ఎన్ ఆర్ ఎ ప్రాతిపదిన ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో మిగిలిన ఏరియాలకు కూడా ఇదే రేషియోను అప్లయ్ చేయాల్సి వచ్చింది. అంటే ఆంధ్ర ఏరియా జస్ట్ నాలుగు కోట్ల రేషియోలో ఇచ్చినట్లు అయింది.

ఈ ప్రాతిపదికన చూసుకుంటే థియేటర్ మీద పది కోట్లు రావడం ఎలా సాధ్యం? ప్రవీణ్ సత్తారు చెబుతున్న బ్రేక్ ఈవెన్ ఎలా సాధ్యం?

కాస్సేపు 54 రోజుల్లో తీసా, బడ్జెట్ తగ్గించా అంటూ వాదించిన ప్రవీణ్ సత్తారు. మరి కాస్సేపు మీకెందుకు లెక్కలు చెప్పాలి. మీకు ఏమిటి సంబంధం? మీరేమైనా సినిమా తాలూకా అంటూ లా పాయింట్ లాగారు. మరి ఏం సంబంధం అని అన్ని విషయాలు చెప్పారు. ఏం సంబంధం అని కూర్చోపెట్టి అంత సేపు మాట్లాడారు.

సత్తా మాటల్లో కాదు సినిమా మేకింగ్ లో చూపించి, నిర్మాతను లాభాల్లో వుంచితే చాలు. ఎవరికీ ఏ సమాధానం చెప్పనక్కరలేదు.