నితిన్ సినిమాలో యాంగ్రీ హీరో

యాంగ్రీ యంగ్ మాన్ కాదు ఇప్పుడు రాజశేఖర్. కానీ యాంగ్రీ అండ్ ఫెరోషియస్ నే ఎప్పటికీ. సరైన పాత్ర, సరైన డైరక్టర్ సెట్ కావాలి కానీ, అదరగొట్టేస్తాడు. ఈ మధ్య చాలా అంటే చాలా…

యాంగ్రీ యంగ్ మాన్ కాదు ఇప్పుడు రాజశేఖర్. కానీ యాంగ్రీ అండ్ ఫెరోషియస్ నే ఎప్పటికీ. సరైన పాత్ర, సరైన డైరక్టర్ సెట్ కావాలి కానీ, అదరగొట్టేస్తాడు. ఈ మధ్య చాలా అంటే చాలా కాలంగా అలాంటి అవకాశం లేక సైలంట్ గా వుండిపోయారు. 

ఇప్పుడు ఓ మాంచి పాత్ర వచ్చింది. మాంచి సినిమా పడింది. డైరక్టర్ కూడ సెట్ అయ్యారు. అదే… నితిన్ హీరోగా నటిస్తున్న ఎస్ట్రార్డినరీ మాన్. దర్శకుడు వక్కంతం వంశీ (నా పేరు సూర్య).

ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ వుంది. దీనికి ఎవర్ని తీసుకోవాలా అని లెక్కలు కడుతూ ఇప్పటి వరకు వెయిట్ చేసారు. షూట్ ఆల్ మోస్ట్ పూర్తైపోవస్తోంది. ఇక ఇప్పుడు ఫైనల్ చేసి బ్యాలన్స్ వర్క్ పూర్తి చేయాల్సి వుంది. అందువల్ల ఈ పాత్రకు ఇప్పుడు సీనియర్ హీరో రాజశేఖర్ ను ఫైనల్ చేసి, వర్క్ స్టార్ట్ చేసారు. ఇప్పటికే రెండు రోజుల వర్క్ పూర్తయింది.

నితిన్ ఎక్స ట్రార్డినరీ మాన్ సినిమా డిసెంబర్ 8న థియేటర్రలోకి వస్తోంది. ఇటీవల కాస్త ఫామ్ నుంచి పక్కకు వెళ్లిన హీరో నితిన్ ఈ సినిమా మీద గట్టి ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మాస్ మసాలా సినిమా. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వుండేలా చూసుకున్నారు. ఆ మేరకు మొదట అనుకున్న స్క్రిప్ట్ కు మార్పులు చేర్పులు చేసుకున్నారు.