నితిన్ ‘జూనియర్’

హీరో నితిన్ ఓ ఎంటర్ టైన్ మెంట్ సినిమా చేయబోతున్నాడు. ఎక్కడెక్కడి కథల సారూప్యం వున్నా, మంచి కథలు వండుతారు అని పేరున్న దర్శకుడు వక్కంతం వంశీ అందిస్తున్న సినిమా ఇది.  Advertisement నా…

హీరో నితిన్ ఓ ఎంటర్ టైన్ మెంట్ సినిమా చేయబోతున్నాడు. ఎక్కడెక్కడి కథల సారూప్యం వున్నా, మంచి కథలు వండుతారు అని పేరున్న దర్శకుడు వక్కంతం వంశీ అందిస్తున్న సినిమా ఇది. 

నా పేరు సూర్య డిజాస్టర్ తరువాత చేస్తున్న సినిమా ఇది. టాగోర్ మధు నిర్మాత. ఈ సినిమాకు జూనియర్ అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథ ఛాయలు కూడా అటు కిక్..ఇటు పోకిరి లను పోలి వుంటాయని తెలుస్తోంది. 

సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ గా వుంటుంది. పోకిరి మాదిరిగా యాక్షన్ సినిమా కాదు. కానీ పోకిరిలో వుండే కోర్ పాయింట్ నే ఈ సినిమాలో కూడా వుంటుందని తెలుస్తోంది.

ప్రస్తుతం మాచర్ల నియోజ‌కవర్గం అనే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా చేస్తున్నాడు నితిన్. దాని తరువాత ఈ సినిమా మొదలవుతుంది. దర్శకుడిగా వక్కంతం వంశీ రెండో ప్రయత్నం ఇది. ఎలాగైనా సక్సెస్ కొట్టాలని పగడ్బందీగా ప్రయత్నిస్తున్నారు.