‘వారియర్’లో విల‌న్‌ గా ఆది పినిశెట్టి

హీరో పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా డిఫరెంట్ స్టోరీలు, క్యారెక్టర్లు వస్తే చేసే యంగ్ హీరోల్లో ఆది పినిశెట్టి ఒకరు. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే, మరో వైపు విలన్ రోల్స్ కూడా చేస్తున్నారు.…

హీరో పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా డిఫరెంట్ స్టోరీలు, క్యారెక్టర్లు వస్తే చేసే యంగ్ హీరోల్లో ఆది పినిశెట్టి ఒకరు. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే, మరో వైపు విలన్ రోల్స్ కూడా చేస్తున్నారు. 'సరైనోడు' సినిమాలో చేసిన విలన్ రోల్ ఆది పినిశెట్టికి గుర్తింపు తీసుకొచ్చింది. ఇంకోసారి ఆయన విలన్ రోల్ చేస్తున్నారు. 

రామ్ పోతినేని కథానాయకుడిగా తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న సినిమా 'ది వారియర్'. ఇందులో ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. 

మహాశివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకుని సినిమాలో అతడి క్యారెక్టర్, పేరు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. 'ది వారియర్స‌ లో గురు పాత్రలో ఆది పినిశెట్టి కనిపించనున్నాడు. లుక్ చూస్తే… ఏమాత్రం కనికరం లేని వ్యక్తిగా ఉంది. 

పెర్ఫార్మన్స్‌కు స్కోప్ ఉన్న రోల్ అని, ఆది పినిశెట్టి కొత్తగా కనిపిస్తాడని తెలిసింది. ఈ సినిమాలో రామ్ పోలీస్ రోల్ చేస్తున్నారు. పోలీస్, విలన్ మధ్య ఫైట్ సినిమాకు హైలైట్ అని నిర్మాత శ్రీనివాసా చిట్టూరి చెబుతున్నారు. 'ది వారియర్'లో రామ్ జోడీగా కృతి శెట్టి నటిస్తోంది.