cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

వివేకా అల్లుడు.. కుట్రలకు, కపటత్వానికి కేరాఫ్ అడ్రస్!

వివేకా అల్లుడు.. కుట్రలకు, కపటత్వానికి కేరాఫ్ అడ్రస్!

తాము మసిపూస్తే చాలు.. పల్లేరుకాయను కూడా మారేడు కాయగా మార్చేసి ప్రజలను నమ్మించవచ్చునని పచ్చమీడియాకు ఒక అపరిమితమైన నమ్మకం. ఆ క్రమంలోనే నిన్నటిదాకా.. వివేకా హత్యోదంతంలో అవినాష్ రెడ్డిని మూలకారకుడిగా నిరూపించడానికి నానా వంటల కథనాలను వాంగ్మూలాల పేరుతో ప్రచురించిన మీడియా.. ఇవాళ ఏకంగా జగన్ మీదికే అస్త్రసంధానం చేసింది. అయితే.. పచ్చమీడియా మరియు చంద్రబాబు బుల్లెట్ పేల్చడానికి తుపాకీ పెట్టబడిన భుజం మాత్రం నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ది!

‘వైఎస్ వివేకానందరెడ్డికి అల్లుడు’ అనే ట్యాగ్‌లైన్ లేకపోతే గనుక.. ఈ రాజశేఖర రెడ్డి ఊసు ఎవరికీ పట్టేది కాదు. వివేకా చచ్చిపోబట్టి.. అల్లుడు హోదాలో ఆయన వాంగ్మూలాల రేంజికి వచ్చారు గానీ.. వాస్తవానికి ఆయన చరిత్ర మొత్తం అత్యంత వివాదాస్పదమూ, అనుమానాస్పదమూ అయినటువంటిది! పచ్చమీడియా ప్రొజెక్టు చేస్తున్న కోటరీ మొత్తం.. అవినాష్ ను నిందితుడిగా చాటడానికి ప్రయత్నం చేస్తుండగా.. దానికి విరుద్ధంగా, వైసీపీ వర్గాలు, అవినాష్ వర్గం తదితరులు చెబుతున్న మాటల ప్రకారం అయితే.. హత్య వెనుక అల్లుడు రాజశేఖర రెడ్డి హస్తమే ఉందనే సంగతి ప్రచారంలో ఉంది. 

ఈ విషయంలో కోర్టులో కూడా పిటిషన్లు దాఖలై ఉన్నాయి. అవినాష్ తో సమానంగా, రాజశేఖర్ మీద ఆరోపణలు ఉన్నాయి. ఇవి రెండు వర్గాల నుంచి ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు రాజశేఖర్ రెడ్డి ఎవరు? ఎలాంటివాడు? అనే విషయంలో ప్రజలకు ఆసక్తి ఉండడం సహజం.

మామను వివాదాస్పదుడిగా మార్చిన ఘనుడు!

వైఎస్ వివేకానందరెడ్డి, తన అన్న రాజశేఖర రెడ్డికి ఎంతటి విధేయుడైన తమ్ముడిగా, ఆయన సూచనల మేరకు మాత్రమే నడుచుకునే రాజకీయ నాయకుడిగా ఉండేవాడో అందరికీ తెలుసు. ఆ విషయం కొత్తగా చెప్పే అవసరమూ లేదు. అయితే.. వైఎస్సార్ అకాల మరణానికి గురైన సందర్భంలో.. కాంగ్రెస్ పార్టీలో ఆయన స్థానాన్ని భర్తీ చేసే నాయకుడిగా ఎదగాలని వివేకానండరెడ్డిని పురిగొల్పిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. 

ముఖ్యమంత్రి పదవి మరొకరి చేతికి వెళ్లినా.. వైఎస్ కుటుంబం నుంచి కేబినెట్ లోకి మంత్రిగా ప్రవేశించి.. నెమ్మదిగా చక్రం తిప్పితే నెమ్మదిగా వైఎస్సార్ స్థానాన్ని రీప్లేస్ చేయవచ్చునని స్కెచ్ వేశారు. అప్పట్లోనే జగన్‌తో  వివేకా మనస్పర్ధలకు కారణమయ్యారు. 

వైఎస్ విజయమమ్మ పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేస్తే.. వివేకానంద రెడ్డికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా.. వదినపై పులివెందులలో ఎమ్మెల్యేగా పోటీచేయాలని పురిగొల్పింది ఈ రాజశేఖర రెడ్డే అనే ప్రచారం బాగా ఉంది. వివేకాను బలవంతంగా ఎమ్మెల్యే బరిలోకి దింపారు. వైఎస్సార్ కుటుంబంతో మనస్పర్ధలు రావడానికి ప్రధాన కారణం అయ్యారు. 

ఆ తర్వాత.. వాస్తవాల్ని గ్రహించిన వివేకానందరెడ్డి.. తనే మేలుకుని అల్లుడు రాజశేఖర్ రెడ్డిని దూరం పెట్టారని, అందుకే వారితో సంబంధం లేకుండా విడిగా ఉండేవారని అంటారు. వ్యక్తిగత విషయాల ప్రస్తావన సబబు కాదు గానీ.. వివేకానందరెడ్డి కుటుంబం పరంగా రాజశేఖర్ రెడ్డి, కూతురు సునీతలను దూరం ఉంచినట్లే స్థానికులు చెబుతుంటారు. చిన్నాన్న నిజం తెలుసుకున్న తర్వాత.. జగన్ కు వివేకా పట్ల మనస్పర్ధలు తొలగిపోయాయి. వైసీపీలో తిరిగి ఆయనకు ప్రాదాన్యం దక్కింది. ఆయనకు మంత్రి పదవి మీద కోరిక ఉన్నదేమో గానీ.. మొత్తానికి జగన్ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో వివేకానందరెడ్డి ఓడిపోయారు. 

తర్వాతి పరిణామాలు కక్షలు, సెటిల్మెంట్ తగాదాల రూపం సంతరించుకున్నట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. మొత్తానికి వివేకానందరెడ్డి హత్య జరిగింది. అయితే హత్య జరిగిన నాటినుంచి.. ఆయన మరణాన్ని వాడుకుని.. తనకు రాజకీయ సోపానాలుగా మలచుకోవడానికి రాజశేఖర్ రెడ్డి చాలా ప్రయత్నించారు. 

జగన్ ను పదేపదే కలిశారు. మామయ్య మరణం నేపథ్యంలో తనకు లబ్ధి దక్కించుకోడానికి ఆశ్రయించారు. అయితే నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అసలు బుద్ధి బాగా తెలిసిన జగన్ ఆయనను దూరం పెట్టారు. ఖాతరు చేయలేదు. అక్కడినుంచి ప్లేటు ఫిరాయించి.. అవినాష్ రెడ్డిని హంతకుడిగా చిత్రీకరిస్తూ.. ఇవాళ్టి వార్తల వరకు జగన్మోహన రెడ్డినే సూత్రధారిగా అభివర్ణించే దాకా వచ్చారు. 

‘లూసిఫర్’ సినిమాలో బాబీని గుర్తుకు తెచ్చేలా..

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేసే ప్రయత్నంలో ఉన్న మళయాళ చిత్రం లూసిఫర్ అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో మోహన్ లాల్ హీరో. అదే సినిమాలో బాబీ అనే పాత్ర ఉంటుంది. మామయ్యను వాడుకుని.. తన వక్రప్రయోజనాలు నెరవేర్చుకోడానికి అల్లుడు బాబీ అడ్డదారులు తొక్కుతుంటాడు. కూతురిని కూడా మాయలో పెడుతూ.. మభ్యపెడుతూ ఉంటాడు. 

సదరు మామయ్య కూతురు కూడా ద్వేషిస్తూ ఉండే ఆమె సోదరుడు (వరుసకు) లూసిఫర్.. తనను ద్వేషిస్తూ ఉన్నా సరే.. తాను మాత్రం ఆ కుటుంబానికి అండగానే ఉంటాడు. చివరికి తన సోదరి నిజం తెలుసుకునే సమయానికి తానే సాహసించి.. వారిని అల్లుడు బాబీనుంచి కుట్రలనుంచి కాపాడుతాడు.

నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వ్యవహారం అచ్చంగా లూసిఫర్ చిత్రంలో బాబీలాగా ఉన్నదని అందరూ వ్యాఖ్యానిస్తున్నారు. మామయ్యను రెచ్చగొట్టి వైఎస్సార్ కుటుంబంతో వైషమ్యాలు ఏర్పడేలా, పెరిగేలా చేసిన ఈ వ్యక్తే.. మామయ్య మరణాన్ని తనకు లాభసాటిగా మార్చుకోవాలని ప్రయత్నించినట్లు సమాచారం. వివేకానందరెడ్డి మరణం తర్వాత.. నిజజీవితపు బాబీ అయిన ఈ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి.. తనకు/ తన కుటుంబానికి ఏపీలో ఒక మెడికల్ కాలేజీ కావాలనే ఆబ్లిగేషన్ తో ముఖ్యమంత్రి జగన్ ను ఆశ్రయించాడని, అయితే ఇతని బుద్ధి తెలిసిన జగన్ ఆ మాయోపాయాలకు పడలేదని చాలా మంది అంటుంటారు. 

అలాంటి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి.. సీబీఐ వాళ్లు అడిగితే ఎలాంటి మాటలు చెప్తాడో చిన్నపిల్లలైనా ఊహించగలరు. ఒకవైపు హత్య చేయించింది రాజశేఖర్ రెడ్డే అనే ఆరోపణలు.. ఒక వర్గం నుంచి బలంగా వినిపిస్తుండగా.. ఆ పిటిషన్లకు, సమాచారానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని పచ్చ పత్రికలు, ఆయన వాంగ్మూలం పేరుతో ఒక వంటకాన్ని ప్రచురించడానికి, ఒకవేళ వాంగ్మూలం నిజమే అయినా.. ఈ కపటవ్యక్తి మాటల్ని విశ్వసనీయ సమాచారంగా పరిగణించి బ్యానర్ వార్తలు ప్రచురించడమే సిగ్గుచేటు. 

ఈ వ్యవహారాలను చూసిన ఎవ్వరికైనా ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతున్న కుట్ర అనే సంగతి ఇట్టే అర్థమవుతుంది.

మహేష్ ఙోకులు మామూలుగా వుండవు

టార్గెట్ 175.. కొడతారా? లేదా?