హీరో నితిన్ పవర్ పేట అనే పొలిటికల్ టచ్ సినిమా చేస్తాడని చిరకాలంగా వినిపించింది. కానీ అది మెటీరియలైజ్ కాలేదు.
ఇప్పుడు ఎడిటర్ శేఖర్ డైరక్షన్ లో సినిమా స్టార్ట్ చేసేసాడు. దానికి భలే చిత్రమైన టైటిల్ డిసైడ్ చేసారు. 'మాచర్ల నియోజకవర్గం' ఇదీ టైటిల్.
సినిమా టైటిల్ సౌండ్ అయితే పొలిటికల్ టచ్ అన్నట్లుంది. అదయినా అయి వుండాలి. లేదా మాచర్ల నియోజక వర్గం వ్యవహారాలు అయినా అయి వుండాలి. ఎలా అయినా పొలిటికల్ టచ్ తప్పదు.
రకరకాల జోనర్లు ట్రయ్ చేస్తున్న నితిన్ ఈసారి ఈ లైన్ లోకి వచ్చారు. శేఖర్ తయారుచేసిన కథ బాగా నచ్చడంతో దాన్ని ఓన్ ప్రాజెక్టు గా స్టార్ట్ చేసారు. ఎలా వుంటుందో చూడాలి మరి.