నితిన్ ‘రాబిన్ హుడ్’?

హీరో నితిన్ మైత్రీ మూవీస్‌తో ఒక సినిమా చేస్తున్నారు. దర్శకుడు వెంకీ కుడుముల భీష్మ తరువాత మళ్లీ నితిన్ తో చేస్తున్న సినిమా. ఈ సినిమాకు టైటిల్ ఇంకా ప్రకటించలేదు. నితిన్ బర్త్ డే…

హీరో నితిన్ మైత్రీ మూవీస్‌తో ఒక సినిమా చేస్తున్నారు. దర్శకుడు వెంకీ కుడుముల భీష్మ తరువాత మళ్లీ నితిన్ తో చేస్తున్న సినిమా. ఈ సినిమాకు టైటిల్ ఇంకా ప్రకటించలేదు. నితిన్ బర్త్ డే సందర్భంగా ప్రకటించే అవకాశం వుంది.

ఈ సినిమాకు రాబిన్ హుడ్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నితిన్ తెలుగు సినిమా ఒకటి హిందీలో డబ్ అయినపుడు ఆజ్ కా రాబిన్ హుడ్ అనే టైటిల్ వాడారు. అదే స్ఫూర్తితో ఇక్కడ ఈ టైటిల్ పెడుతున్నారేమో?

వెంకీ కుడుములకు బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్ లు వున్నాయి. ఈ సారి కూడా మాంచి హిట్ స్క్రిప్ట్ తోనే సినిమా చేస్తున్నారని టాక్. అవుట్ అంట్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ కు యాక్షన్ టచ్ ఇస్తూ స్క్రిప్ట్ తయారు చేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు మొదట రష్మికను హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ కారణాంతరాల వల్ల ఆమె సినిమా నుంచి తప్పుకున్నారు. శ్రీలీల ను ఫిక్స్ చేసారని వార్తలు వినవచ్చాయి. అయితే ఇప్పుడు ఆమెను కూడా మారుస్తున్నారని తెలుస్తోంది.

ఈ నెల 27 నుంచి ఈ సినిమా సెట్ మీదకు నితిన్ జాయిన్ అయ్యే అవకాశం వుంది.