నితిన్ – వక్కంతం వంశీ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా ఒకటి వుంది. సగానికి పైగా పూర్తయిందీ సినిమా. నితిన్ నుంచి త్వరలో వచ్చేది ఈ సినిమానే.
ఈ సినిమా తరువాతనే వెంకీ కుడుమల-మైత్రీ మూవీస్ సినిమా. ఆ తరువాత వచ్చేది దిల్ రాజు-వేణుశ్రీరామ్ సినిమా. ఈ లోగా జూలై నెలలో వక్కంతం వంశీ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతున్నాయి.
వక్కంతం వంశీ-నితిన్ సినిమాకు ముందుగా జూనియర్ అనే టైటిల్ వార్తల్లోకి వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల అది పాజిబుల్ కాలేదు. ఇప్పుడు కొత్త టైటిల్ డిసైడ్ చేసారు. ఈ టైటిల్ కాస్త చిత్రంగా వుంది. టైటిల్..ప్లస్ ట్యాగ్ లైన్ కలిపి చదివితే తప్ప టోటల్ టైటిల్ కాదు అనుకోవాలి.
ఎగస్ట్రా అనేది టైటిల్. ఆర్టినరీ మాన్ అన్నది ట్యాగ్ లైన్. అంటే ఎక్స్ట్రారినరీమాన్ అన్న పదం ఇలా రూపాంతరం చెందింది అన అనుకోవాలేమో? లేదా ఓ ఆర్డినరీ మాన్- ఎగస్ట్రా ఆర్టినరీ మ్యాన్ గా ఎలా మారాడనేమో? మొత్తం మీద కాస్త డిఫరెంట్ సబ్జెక్ట్.. డిఫరెంట్ టైటిల్ తో వస్తూందీ సినిమా.