పవన్ సెకెండ్ ఇన్నింగ్స్ లో తయారువుతున్న భారీ సినిమా భీమ్లా నాయక్. పవన్ కు యాభై కోట్లు, రానాకు అయిదు కోట్లు రెమ్యూనిరేషన్ అని టాక్. అలాగే సినిమాటోగ్రాఫర్ కు రెండు కోట్లు, మ్యూజిక్ డైరక్టర్ కు మూడుకోట్లు అని కూడా టాక్.
మరి ఇందులో కీలకపాత్ర అయిన పవన్ భార్యగా నటిస్తున్న నిత్యా మీనన్ సంగతేమిటి? ఆమె రెమ్యూనిరేషన్ ఎంత వుంటుంది? జస్ట్ 85 లక్షలు మాత్రమే.
మంచి నటి, సినిమాలతో, వెబ్ కంటెంట్ లతో ఫుల్ బిజీగా వున్న నిత్య మీనన్ ఈ సినిమా కోసం చార్జ్ చేసింది జస్ట్ 85 లక్షలు మాత్రమే.
అదే పూజా హెగ్డే అయితే రెండు కోట్ల పై మాటే.కానీ ఆ పాత్రకు పూజా అస్సలు సెట్ కాదు. పైగా పిల్ల తల్లిగా, కాస్త డీ గ్లామర్ పాత్రకు అందరు హీరోయిన్లు ఓకె అనరు. నిత్య కు మంచి పాత్రలే కావాలి కాబట్టి. ఓకె అంది. రెమ్యూనిరేషన్ కూడా రీజనబుల్ గా చార్జ్ చేసింది.