చిరంజీవి సినిమాలో నివేత పెతురాజ్

చిరంజీవి, బాబి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం రవితేజను తీసుకున్న సంగతి కూడా…

చిరంజీవి, బాబి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం రవితేజను తీసుకున్న సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడీ ప్రాజెక్టుకు హీరోయిన్ ను సెట్ చేశారు. సినిమాలో రవితేజకు హీరోయిన్ గా నివేత పెతురాజ్ ను తీసుకున్నారు.

తెలుగులో చిత్రలహరి, బ్రోచేవారెవరురా, రెడ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది నివేత పెతురాజ్. గ్లామర్ పాత్రలు కాకుండా, నటించడానికి స్కోప్ ఉండే పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ఓ స్పేస్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడీ ముద్దుగుమ్మను చిరంజీవి-రవితేజ సినిమాలో తీసుకున్నారంటే, కచ్చితంగా ఆమెది కీలక పాత్ర అనే విషయం అర్థమౌతోంది.

సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఇప్పటికే శృతిహాసన్ ను తీసుకున్నారు. చిరంజీవి సరసన శృతిహాసన్, రవితేజ సరసన నివేత పెతురాజ్ కనిపించబోతున్నారన్నమాట.

ఇప్పటివరకు యంగ్ హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చింది నివేత పెతురాజ్. కెరీర్ లో ఫస్ట్ టైమ్ రవితేజ లాంటి సీనియర్ హీరో సరసన నటించబోతోంది. త్వరలోనే రవితేజ, నివేత కలిసి సెట్స్ పైకి రాబోతున్నారు.

ఈ సినిమా కోసం దేవిశ్రీప్రసాద్ ఇప్పటికే వర్క్ స్టార్ట్ చేశాడు. 3 పాటలు రెడీ చేసి పెట్టాడు. దర్శకుడు బాబి ఈ సినిమా కథ రాయడంతో పాటు మాటలు కూడా అతడే అందిస్తున్నాడు. కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు.