కాజల్ కు తన భర్తతో ఆహా అనిపించలేదట

14 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. తెలుగు, తమిళం, హిందీ అనే తేడా లేకుండా ఎన్నో సినిమాలు చేసింది. దాదాపు ప్రతి సినిమాలో ప్రేమ సన్నివేశాల్లో నటించి మెప్పించింది. కొన్ని సినిమాల్లో కాజల్ ప్రేమ సన్నివేశాలు…

14 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. తెలుగు, తమిళం, హిందీ అనే తేడా లేకుండా ఎన్నో సినిమాలు చేసింది. దాదాపు ప్రతి సినిమాలో ప్రేమ సన్నివేశాల్లో నటించి మెప్పించింది. కొన్ని సినిమాల్లో కాజల్ ప్రేమ సన్నివేశాలు ఆహా అనిపించాయి కూడా.

కానీ తన నిజజీవిత ప్రేమ కథలో మాత్రం అలా ''ఆహా'' అనిపించే ఘటనలు లేవంటోంది కాజల్. గౌతమ్ తో తన ప్రేమ ప్రయాణం అత్యంత సాధారణంగా, కూల్ గా అలా జరిగిపోయిందని చెబుతోంది. ఏడేళ్లుగా గౌతమ్ తో ప్రేమలో ఉన్నప్పటికీ ఆహా అనిపించే మూమెంట్ ఒక్కటి కూడా లేదంటోంది.

“ఇన్నేళ్ల మా పరిచయంలో గౌతమ్ తో నాకు ఒక్కసారి కూడా ఆహా అనిపించలేదు. ఎందుకంటే ప్రేమికులుగా మారడం కంటే ముందు మేం స్నేహితులం. మా ఇద్దరి విషయంలో అన్ని విషయాలు చాలా స్మూత్ గా జరిగిపోయాయి. మేం ఒకర్ని ఒకరం సపోర్ట్ చేసుకున్నాం. కొన్నేళ్లుగా ఒకర్ని మరొకరం అర్థం చేసుకున్నాం. ఇక పెళ్లికి దారితీసిన ఘటనలు కూడా అత్యంత సహజంగా సాగిపోయాయి. అందుకే మా ప్రేమ ప్రయాణంలో ఆహా అనిపించే ఘటనలు మాకు కనిపించలేదు.”

అయితే మరీ ఆహా అనిపించకపోయినప్పటికీ.. గౌతమ్ తో ఫస్ట్ డేట్ మాత్రం తనకు చాలా స్పెషల్ అంటోంది కాజల్. ఈ ముద్దుగుమ్మను తొలిసారి ముంబయిలోని ఎన్సీపీఏ కేఫ్ కు డేటింగ్ కు తీసుకెళ్లాడట గౌతమ్. దాన్ని డేటింగ్ అనడం కంటే ఓ పెద్ద ఇంటర్వ్యూ అనడం కరెక్ట్ అంటోంది కాజల్. ఆరోజు గౌతమ్ తనను ప్రశ్నలతో చంపేశాడని చెప్పుకొచ్చింది. కానీ ఆ ఫస్ట్ డేట్ తనకు కలకాలం గుర్తుండిపోతుందని అంటోంది.