రెమ్యూనిరేషన్ పాటి చేయని కలెక్షన్లు

ఫ్లాపుల హీరోలు సైతం భారీ రెమ్యూనిరేషన్ ఇస్తేనే రంగంలోకి దిగుతున్నారు. కానీ గమ్మత్తేమిటంటే చాలా మంది హీరోల రెమ్యూనిరేషన్ పాటి చేయడం లేదు థియేటర్ కలెక్షన్లు.

టాలీవుడ్ రాను రాను ఓ వేలాం వెర్రి ధోరణిలోకి వెళ్లిపోతోంది. ప్రాజెక్టులు చేసేయాలనే తపనతో హీరోలను పోషించడం పెరిగిపోతోంది. హీరోల రెమ్యూనిరేషన్లు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పుడు కనీసం అయిదు కోట్లు పెట్టకుండా ఓ మాదిరి హీరో డేట్ లు దొరకడం లేదు. ఫ్లాపుల హీరోలు సైతం భారీ రెమ్యూనిరేషన్ ఇస్తేనే రంగంలోకి దిగుతున్నారు. కానీ గమ్మత్తేమిటంటే చాలా మంది హీరోల రెమ్యూనిరేషన్ పాటి చేయడం లేదు థియేటర్ కలెక్షన్లు.

ఏపీ.. సీడెడ్.. తెలంగాణ కలిపి పాతిక కోట్లకు పైగా థియేటర్ హక్కులు అమ్ముడయ్యే హీరోల పేర్లను ఒక చేతి వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. టాలీవుడ్ లో ప్రస్తుతం ప్రామిసింగ్ హీరో అనుకుంటున్న నాని తెలుగు రాష్ట్రాల థియేటర్ల హక్కులు పాతిక కోట్లు మాత్రమే. అవి కూడా రావడం లేదు సినిమాకు ఎంత మంచి టాక్ వచ్చినా. నాని రెమ్యూనిరేషన్ ప్రస్తుతం ముఫై అయిదు కోట్లు అని టాక్.

రవితేజ‌ రెమ్యూనిరేషన్ 25 కోట్లు. థియేటర్ మార్కెట్ 20 కోట్లు కూడా లేదు. అయినా అది కూడా వసూలు కావడం లేదు. చాలా మంది పది కోట్లు తీసుకునే హీరోలు వున్నారు. వీళ్ల థియేటర్ మార్కెట్ వసూళ్లు ఏడెనిమిది కోట్లు కూడా వుండడం లేదు.

కేవలం నాన్ థియేటర్ మార్కెట్ చూపించి రెమ్యూనిరేషన్ లాగేస్తున్నారు. నాన్ థియేటర్ మార్కెట్ కూడా ఇటు రెమ్యూనిరేషన్లకు, అటు నిర్మాణానికి సరిపోవడం లేదు. దాంతో థియేటర్ల మీద నుంచి వచ్చింది కూడా అటే పెట్టాల్సి వస్తోంది. ఇక నిర్మాతకు మిగిలేది ఏమీ వుండడం లేదు. నష్టాలే మిగులుతున్నాయి.

ఇంకో గమ్మత్తేమిటంటే ఇవన్నీ తెలిసి కూడా నిర్మాతలు పోటీ పడి మరీ రెమ్యూనిరేషన్లు అఫర్ చేస్తున్నారు. పెంచుతూ పోతున్నారు. దాంతో వరుస ఫ్లాపులు వస్తున్నా, నిర్మాతలు కుదేలయిపోతున్నా, కోట్లకు కోట్లు నష్టపోతున్నా, రెమ్యూనిరేషన్లు మాత్రం తగ్గడం లేదు. దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టేద్దాం అనుకుని నిర్మాతలను కుదేలు చేసేస్తున్నారు చాలా మంది హీరోలు.

ఓటీటీ మార్కెట్ ప్రస్తుతం చాలా వరకు మారింది. ఇంకా ఇంకా మారితే అప్పుడు చాలా మంది హీరోలు ఇళ్లకు పరిమితం కావడమో, లేదా రెమ్యూనిరేషన్ తగ్గించుకోవడమో చేయకతప్పదు.

12 Replies to “రెమ్యూనిరేషన్ పాటి చేయని కలెక్షన్లు”

  1. “రిఫైన్డ్‌ పామాయిల్‌, సోయా బీన్‌, సన్‌ఫ్లవర్‌ నూనెపై దిగుమతి సుంకాన్ని 12.5 శాతం నుంచి 32.5శాతానికి పెంచుతున్నట్లు కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశీయంగా సోయా, ఇతర నూనెగింజల సాగు మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర రైతులకు ప్రయోజనం కల్పించేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.”

    ప్రక్రుతి విపత్తులలో రైతులకు కలిగే నష్టాన్ని పరిహారం కాదు గదా కనీసం వారి గురించి విచారించడానికి కూడా మతం, కులం, ప్రాంతం, లాభం చూసుకునే వీర భక్తుల party ని జనం నమ్మాలి.

  2. కొంతమంది passion తో… మరికొంతమంది పబ్లిసిటీ కోసం… ఇంకొంతమంది బ్లాక్ to వైట్ కన్వర్షన్ కోసం చేస్తారు. అయినా అది పబ్లిక్ మనీ కాదు. మీ బాధ ఏందీ అంట?

  3. NRI లు Real estate గాళ్ళకు దూల ఎక్కవై నిర్మాతలుగా సినిమాలు తీస్తున్నారు ..

    హిరోఇన్ ని దగ్గరనుండి చూసి చొంగ కార్చుకొవచ్హు అని

  4. కందకు. లేని దురద కత్తిపీటకు ఏల…. ఇచ్చేవాడు ఉంటే తీసుకునేవాడు ఎంతైనా తీసుకుంటాడు… మధ్య మనకెందుకు

  5. అవును మరి. మా మూర్తితాతకున్న తెలివి నిర్మాతలకు లేదు. వారికి డబ్బెక్కువ. అందుకని బిజినెస్ లెక్కలు చూడకుండా, హీరోలకి అంతంత డబ్బు అప్పచెపుతారు.

Comments are closed.