జ‌గ‌న్‌కు జ‌నాద‌ర‌ణ‌.. వైసీపీలో జోష్‌!

ఓడిపోయామే త‌ప్ప‌, జ‌గ‌న్‌కు మ‌ళ్లీ ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌న్న భ‌రోసా వైసీపీ శ్రేణుల్లో క‌లిగింది.

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి వ‌స్తున్న జ‌నాద‌ర‌ణ వైసీపీలో జోష్ నింపుతోంది. జ‌గ‌న్ ఎక్క‌డికెళ్లినా జ‌న‌మే జ‌నం. గుంటూరు జైల్లో నందిగం సురేష్‌ను వెళ్ల‌గా జ‌నం పోటెత్తారు. తాజాగా ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ అడ్డా పిఠాపురం వెళ్లినా, అదే ఆద‌ర‌ణ‌. మూడు నెల‌ల క్రితం ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయిన జ‌గ‌న్‌కు భారీ స్థాయిలో ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతుండ‌డం టీడీపీలో అస‌హ‌నం పెంచుతోంది.

వైఎస్ జ‌గ‌న్ మాస్ లీడ‌ర్‌. ముఖ్య‌మంత్రి కాక ముందు ఆయ‌న ఎప్పుడూ జ‌నంలోనే వుండేవారు. సుదీర్ఘ పాద‌యాత్ర చేప‌ట్టి, నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్యే గ‌డిపారు. తానున్నాన‌నే భ‌రోసా క‌ల్పించారు. అయితే సీఎం అయిన త‌ర్వాత తాడేప‌ల్లి నివాసం నుంచి బ‌య‌టికి రాక‌పోవ‌డంతో జ‌నానికి కోపం వ‌చ్చింది. కేవ‌లం బ‌ట‌న్ నొక్క‌డానికి మాత్ర‌మే స‌భ‌ల‌కు హాజ‌ర‌య్యే వారు. సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిదారుల ఖాతాల్లో డ‌బ్బు జ‌మ చేస్తున్నాన‌ని, ఇక వారిని నేరుగా క‌ల‌వాల్సిన అవ‌స‌రం లేద‌నే భ్ర‌మ‌లో ఆయ‌న ఉండిపోయారు.

తానొక మాస్ లీడ‌ర్ అనే సంగ‌తిని జ‌గ‌న్ మ‌రిచిపోయారు. కేవ‌లం సంక్షేమ ప‌థ‌కాల్ని నిబ‌ద్ధ‌త‌తో అమ‌లు చేస్తే స‌రిపోద‌ని, ప‌రిపాల‌న అంటే ఇత‌ర‌త్రా అంశాలుంటాయ‌ని ఆయ‌న విస్మ‌రించారు. ఎన్నిక‌ల్లో మూల్యం చెల్లించుకున్నారు. ఓట‌మి త‌ర్వాత ఆయ‌న‌కు త‌త్వం బోధ‌పడింది. ఆయ‌న‌కు ఓట‌మి పాఠాలు చెప్పింది.

దీంతో ఏ చిన్న అవ‌కాశం దొరికినా జ‌నంలోకి వెళ్ల‌డానికి ఆయ‌న ప్రాధాన్యం ఇస్తున్నారు. విజ‌య‌వాడ‌లో వ‌ర‌ద బాధితుల్ని ప‌రామ‌ర్శించ‌డానికి రెండుసార్లు వెళ్లారు. వ‌ర‌ద బాధితులు ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. జ‌గ‌న్‌తో సెల్ఫీలు దిగ‌డానికి పోటీ ప‌డ్డారు. జ‌గ‌న్ నెల్లూరు వెళ్లినా అదే ఆద‌ర‌ణ‌.

జ‌గ‌న్‌కు ల‌భిస్తున్న ఆద‌ర‌ణ చూసి, వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్లో ధైర్యం వ‌చ్చింది. ఓడిపోయామే త‌ప్ప‌, జ‌గ‌న్‌కు మ‌ళ్లీ ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌న్న భ‌రోసా వైసీపీ శ్రేణుల్లో క‌లిగింది. మ‌ళ్లీ మ‌న‌దే ప్ర‌భుత్వం అనే ధీమా రోజురోజుకూ పెరుగుతోంది. వైసీపీ కోణంలో చూస్తే, ఇంత‌కంటే నైతిక స్థైర్యం ఏం కావాలి?

71 Replies to “జ‌గ‌న్‌కు జ‌నాద‌ర‌ణ‌.. వైసీపీలో జోష్‌!”

  1. డబ్బులు ఇచ్చి జనాన్ని తెప్పించుకొని ఇలాంటి డ్రామాలు వెయ్యటం అన్నా చెల్లెలకి అలవాటె! అప్పట్లొ షర్మిల కూడా తెలంగణాలొ ఇలానె రక్తి కట్టించారు!

    .

    పడె వర్షం ఆపెయటం, రొగాలు నయ్యం చెయటం లాంటి విన్యాసాల తొ ప్రజలని నమ్మించటం కూడా వీల్ల ఫ్యామిలీ లొ చాల మంది చెసారు. ప్రజలని గొర్రెలని చెయటం వీళ్ళకి అలవాటె!

  2. అదేంటి GA…. అధికార కూటమికి తన speech లతో చుక్కలు చూపించాడు అని రాయలేదేంటి GA….😂😂

  3. అసలు ఇతను ఎందుకు వెళ్లాడు ? అక్కడ ఏమి చేస్తున్నాడు ? ఆ బొట్లు ఏంటో, ఆ action ఏంటో, ఆ తొట్టి చేతులు తిప్పటం ఏంటో, balance తప్పాడు అనిపిస్తుంది, మానసిక ఆరోగ్యం కూడా దిగజారినట్లు ఉంది !! చాలా జాలి వస్తుంది, atleast 10 years అన్నా వైజాగ్ hospital inpatient గా ఉండి ట్రీట్మెంట్ తీసుకోవటం తప్పేటట్లు లేదు పిచ్చి ఎదవకి !!

  4. జగనన్నని కలవడానికి వచ్చే వారి వద్ద tickets పెట్టి, చిల్లర పోగేసుకున్నా ప్రభుత్వానికి బోలెడు ఆదాయం.

  5. జగనన్నని కలవడానికి వచ్చే వారి వద్ద tickets పెట్టి, చిల్లర పోగేసుకున్నా ప్రభుత్వానికి బోలెడు ఆదాయం.

  6. జగనన్నని కలవడానికి వచ్చే వారి వద్ద ticketsx పెట్టి, చిల్లర పోగేసుకున్నా ప్రభుత్వానికి బోలెడు ఆదాయం.

  7. “ వ‌ర‌ద బాధితులు ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. జ‌గ‌న్‌తో సెల్ఫీలు దిగ‌డానికి పోటీ ప‌డ్డారు. జ‌గ‌న్ నెల్లూరు వెళ్లినా అదే ఆద‌ర‌ణ‌.”

    నెల్లూరులో కూడా వరద బాధితులు ఉన్నారా?

  8. జూ లో విషసర్పాన్ని చూడటానికి కూడా జనాలు ఎగబడి చూసి ఫోటో లు తీసుకుంటారు ఇది కూడా అంతే ఫ్యాక్షనిస్ట్ ని చూడటానికి బాబాయ్ ని గొడ్డలి తో నరికి నరికి చంపినా నీచుడు జగన్ రెడ్డి ని చూడటానికి వస్తున్నారు

  9. //వ‌ర‌ద బాధితులు ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.//

    సిగ్గుందా మీకు?

  10. నవ్వి పోదురుగాక మనకేంటి ఎలా అయిన రాస్తాం! సినిమా నటుడు అలీ వచ్చిన జనం పోటెత్తుతుంటారు.. దీనిలో టీడీపీకి ఎందుకు అసహనం? నువ్వే చెప్పాలి GA

  11. జగన్ని జనాలు విపరీతం గా అభిమానించారు ఒకప్పుడు..అతను అందర్నీ వదిలేశాడు అధికారం వచ్చాక..జనాలు ముఖ్యం గా రాయలసీమ వాళ్ళు జగన్ నమ్మకద్రోహం తట్టుకోలేకపోయారు..cbn లాంటి వాళ్ళ మీద పెద్ద హోప్స్ లేవు జనాలకి, సో వాళ్ళు ఏదైనా మోసం లాంటిది చేసిన ఒకే అనుకుంటారు, జగన్ తో ఏమంటే అతను జనాలకి నేను వైఎస్ఆర్ కొడుకుని మాట తప్పను అన్నాడు, కానీ ప్రతి వైఎస్ఆర్ కి రివర్స్ గా చేసాడు..ఎంతల జనాలు చీ కొడుతున్నారు అంటే ,అతను వైఎస్ఆర్ కొడుకు కాదు అనేలా, ఇంతటి ద్వేషాన్ని అభిమానం గా మార్చుకొని తిరిగి జగన్ అధిరం లోకి రాగలాడ అంటే అది అనుమానమే

  12. స్థలం: ఒకానొక కారాగారం

    ప్యాలస్ పులకేశి: రే*య్, నీ నుండి నాకు రావాల్సిన ఇసుక , హంజా*యి కమీష*న్ డబ్బు ఇంకా ప్యాలస్ కి జమ కాలేదు అని గజ్జ*ల చెప్పాడు. ఎప్పుడు ఇస్తావ్!

    అది వ*సూలు చేసుకోడానికి వచ్చాను బెం*గళూర్ నుండి. త్వరగా చెప్పు.

    నిందిత ఖైదీ నాయకుడు: దొ*రా, నీ *బాంచన్ , నా ఇ*సుక తవ్వే పడవలు , మీరు చె*ప్పారు అని బే*రేజి మీదకి వదిలే*సాను, అవి పో*లీసులు పట్టుకున్నారు.

    కావాలి అంటే , నాకు బాగా అలవాటు అయిన హం*జాయ నీ మన పార్టీ అభిమాని అయినా కానిస్టే*బుల్ సహాయంతో ఈ కారా*గారం లో తోటి ఖైదీ లకి అమ్మి ఆ డబ్బు ప్యా*లస్ కి పంపిస్తాను.

    ప్యాలస్ పులకేశి: నువ్వు ఏదైనా చేసుకో, నాకూ మాత్రం నా వా*టా డ*బ్బు తప్ప*కుండా కావాలి. జా*గ్రాత్త..

  13. 😂😂😂

    బాబోయ్ స్వామి భక్తి అంటే నీదే రా GA

    మత్తు వదలరా 2 లో కమెడియన్ సత్య గారి కంటే నిన్న జగన్ గారు చేసిన పిచ్చి చేష్టల కామెడీ నే అద్భుతంగా పేలింది అని అందరు తెగ నవ్వుకుంటున్నారు, జగన్ గారు ఇలానే జనాల్లో ఉంటే కమెడియన్స్ కి కష్టమే

  14. ఇప్పుడు ఆదరణ లభించింది అని ఆనంద పడుతున్నారు అంటే నిన్నటి దాకా ఆదరణ లేదు అని నమ్ముతున్నట్లే కదా…. అంటే ఈవీఎం టాంపరింగ్ అని బలంగా పైకి చెప్పి లోపల మాత్రం మనకి ప్రజల్లో ఆదరణ లేదు కనుక ఓడిపోయాము అని పార్టీ శ్రేణులు నమ్ముతున్నారా … భలే నిజాలు చెప్తారు అండి అప్పుడు అప్పుడు….

  15. వరద భాదితులు ఘన స్వాగతం పలకడం ఇంటి రా…. వాళ్ళ బాధలు, ఇబ్బందుల్లో వాళ్ళు ఉంటే

  16. ఆ జనాలు మీ జగన్ రెడ్డి ని కొండెర్రిపప్ప ని చేస్తున్నారు.. మీ కోడిబుర్రలకు అది అర్థం అయి చావడం లేదు..

    పైడ్ ఆర్టిస్టులతో నడుస్తున్న పార్టీ .. వైసీపీ..

    అసలు జగన్ రెడ్డి పార్టీ లో ఉన్న నాయకులు ఎవరిప్పుడు.. కొడాలి నాని, రోజా, పేర్ని నాని, గుడివాడ అమర్నాధ్, అంబటి రాంబాబు, విడుదల రజని..

    ఆహా.. ప్రపంచం లో ఉన్న చెత్తంతా పోగేసుకుని నడుపుతున్న పార్టీ .. వైసీపీ..

    నిజాలు దాచేసి .. భజన లో తరిస్తున్న నాయకుడు .. జగన్ రెడ్డి.

    జగన్ రెడ్డి మళ్ళీ సీఎం అయి ఏమి పీకుతాడు.. రుషికొండ పాలస్ లో రెస్ట్ తీసుకొంటాడు.. అంతేనా..

    దానికోసం మీరు భజన ఆర్టికల్స్ వండి వారుస్తున్నారు..

  17. నీ భాద చూడలేక పోతున్నాం గ్రేట్ ఆంధ్ర.

    ఒకపక్క నీ మొగుడి దగ్గర ఆ విషయం లేదు అంటావ్

    మరోపక్క నా మొగుడు లేస్తే మంచం ఇరిగిద్ది అంటావ్.

    1. అవును, వీడు వాళ్ళ పరువు అంతా తీస్తున్నాడని చాలా మంది రెడ్లు బాధపడుతున్నారు.

  18. Jagan has every chance to bounce back if he take few corrective measures.

    In 2024 jagan got 11. If Jagan is 11 Reddy,

    What about 2019 – Pa’One’ kalyan.

    Babu 23. Pavan was defeated in two seats.

    When babu-pavan could get power 2024 with such a humiliation defeat in 2019… why can’t jagan bounce back. He has a strong vote bank. Even with that much anti-incumbancy.. he could get 40% voting and 1.32 Crores votes.

    Kutami is moving on utterly wrong track with no administration / development and welfare programmes. Just passing time blaming jagan for everything.

      1. adi nammaru ee sari…gulaka rai, hatya prayatnam fail kada…….ee sari…………..veedu nijam poi….vinasham ki gaani, cement ki gaani help cheyochu….kavalante//////M L A gaa…sympothy votes meeda…….ante …

    1. అరే రెడ్డి గా last time డ్రామా లు workout అవ్వ ledu గా , మిగిలిన తల్లో పెళ్ళమో.. ఎవరినో ఒకరిని వేసేసి try చెయ్యటమే next time ki ..

    2. you are correct , నిజంగా జగన్ కి వచ్చే ఎన్నికలలో 11 నుండి 1 సీట్ వస్తే భయపడడం దేనికి , సరైన పోటీ ఇవ్వగలిగినోడికి భయపడాలి గాని ఒకటో అరా సీటు వచ్చే వాళ్ళకి భయపడడం దేనికి . మొత్తం టీడీపీ బ్యాచ్ దిగిపోయింది ఇక్కడ అంటేనే అర్థం అవుతోంది వీళ్ళకి జగన్ అంటే ఏపాటి భయమో, జనరల్ గ ఎవ్వరికి బయపడవల్సిన అవసరం లేదు, ఈ విధంగా భయపడుతూ , ఇన్ని రకాలుగా మెసేజ్ పెడుతున్నారు అంటే , గడచినా ఎన్నికలలో వీళ్ళ గెలుపు ఏ పాటిదో అర్థం అవుతోంది

  19. ఆ దరిద్రగొట్టొడి దగ్గర కూలి తీసుకొని నువ్వెలా ఆర్టికల్ రాసావో …

    ఆ కనబడతున్న జనాలు కూడా కూలీ తీసుకొనే వచ్చారు.

    అక్కడ అభిమానము లేదూ గోంగూర కట్టా లేదు.

    ఊరికే నలిగిపోకు.

  20. మొదటిసారి ఎంపీ అయ్యాడు – మేత ఫ్రై అయ్యాడు

    మొదటిసారీ ఎమ్మెల్యే అయ్యాడు – ఆంధ్ర రెండు ముక్కలు అయింది

    మొదటిసారీ ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు – హుదూద్ వచ్చింది

    మొదటిసారి సీఎం అయ్యాడు – ఈసారి ప్రపంచమే కరోనాతో నాశనం అయింది.

    ఏమి లెగ్గురా జగ్గా నీది.. ఇంకొక ఛాన్స్ మాత్రం ఇవ్వము రా అయ్యా

  21. chandrababu administration is not good . Utter administrative Failure and publicity mania are quite evident. Babu should focus more on the ministers . Pawan Kalyan also is behaving very lazy . I was against Jagan but when I keenly observed jagan s rule was much better . He didn’t come out of palace and mingled with people that’s the only problem with Jagan

  22. Biryani packets icchi tecchukune janam choosi vaade murisipovali. Public is with Pawan sir. Next power and next CM is the one and only Power star God Pawan sir.

Comments are closed.