పెద్దిరెడ్డికి పెరిగిన ప్రాధాన్యం

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి వైసీపీలో ప్రాధాన్యం పెరిగింది. పెద్దిరెడ్డిని పొలిటిక‌ల్ అడ్వైజ‌రీ క‌మిటీ మెంబ‌ర్‌( పీఏసీ)గా, అలాగే ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా అధ్య‌క్షుడిగా నియ‌మిస్తూ ఉత్త‌ర్వులిచ్చారు. ఎన్నిక‌ల్లో వైసీపీ 11 ఎమ్మెల్యే, 4…

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి వైసీపీలో ప్రాధాన్యం పెరిగింది. పెద్దిరెడ్డిని పొలిటిక‌ల్ అడ్వైజ‌రీ క‌మిటీ మెంబ‌ర్‌( పీఏసీ)గా, అలాగే ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా అధ్య‌క్షుడిగా నియ‌మిస్తూ ఉత్త‌ర్వులిచ్చారు. ఎన్నిక‌ల్లో వైసీపీ 11 ఎమ్మెల్యే, 4 ఎంపీ స్థానాల్లో గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. వీటిలో పెద్దిరెడ్డి కుటుంబానిది కీల‌క భాగ‌స్వామ్యం వుంది.

పుంగ‌నూరు నుంచి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఆయ‌న త‌మ్ముడు ద్వార‌క‌నాథ‌రెడ్డి తంబ‌ళ్ల‌ప‌ల్లె, కుమారుడు మిధున్‌రెడ్డి రాజంపేట పార్ల‌మెంట్ స్థానం నుంచి గెలుపొంద‌డం విశేషం. ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన కుటుంబం కావ‌డంతో పెద్దిరెడ్డికి జ‌గ‌న్ స‌ముచిత స్థానం క‌ల్పించారని స్ప‌ష్ట‌మ‌వుతోంది. పార్టీలో పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఆయ‌న కుమారుడు మిధున్‌రెడ్డి పెత్త‌నం ఎక్కువైంద‌నే విమ‌ర్శ పార్టీలో అంత‌ర్గ‌తంగా వుంది.

అలాగే ఎన్నిక‌ల్లో త‌మ ఓట‌మికి పెద్దిరెడ్డి కార‌ణ‌మ‌ని వైఎస్ జ‌గ‌న్‌కు కొంద‌రు వైసీపీ అభ్య‌ర్థులు ఫిర్యాదు చేశారు. ప్ర‌త్య‌ర్థుల‌కు పెద్దిరెడ్డి ఆర్థిక సాయం అందించార‌నే ఫిర్యాదులు కూడా లేక‌పోలేదు. అయితే పెద్దిరెడ్డిని పొలిటిక‌ల్ అడ్వైజ‌రీ క‌మిటీ మెంబ‌ర్‌గా, చిత్తూరు జిల్లా అధ్య‌క్షుడిగా పెద్దిరెడ్డిని నియ‌మించ‌డంతో ఫిర్యాదుల‌కు జ‌గ‌న్ విలువ ఇవ్వ‌లేద‌ని అర్థ‌మ‌వుతోంది.

ఇదే సంద‌ర్భంలో పెద్దిరెడ్డి త‌న‌పై ఫిర్యాదులు, విమ‌ర్శ‌ల‌పై ఆత్మ విమ‌ర్శ చేసుకోవాల్సిన అవ‌స‌రం వుంది. పార్టీకి రాజ‌కీయంగా న‌ష్టం క‌లిగించేలా న‌డుచుకున్నానా? లేదా? అనేది త‌న అంత‌రాత్మ‌కు స‌మాధానం చెప్పుకోవాల్సి వుంటుంది. ఎందుకంటే పార్టీ అధికారంలోకి రాక‌పోతే, భారీగా న‌ష్ట‌పోయేది తామే అని పెద్దిరెడ్డికి తెలియంది కాదు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత నిత్యం పెద్దిరెడ్డి కుటుంబ‌మే టార్గెట్ అయ్యింది.

చివ‌రికి సొంత నియోజ‌క‌వ‌ర్గానికి కూడా పెద్దిరెడ్డిని వెళ్లకుండా టీడీపీ శ్రేణులు ఎలా వ్య‌వ‌హ‌రిస్తున్నాయో అంద‌రికీ తెలిసిందే. కావున పెద్దిరెడ్డి త‌న పెద్ద‌రికంతో అంద‌రినీ క‌లుపుకుని ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ, అలాగే ఇత‌ర ప్రాంతాల్లోనూ పార్టీ బ‌లోపేతానికి కృషి చేయాల్సిన అవ‌స‌రం వుంది.

15 Replies to “పెద్దిరెడ్డికి పెరిగిన ప్రాధాన్యం”

    1. అధికారంలో ఉన్నప్పుడు మత్తులో మునగడం సహజం, కాబట్టే 2014 లో వచ్చిన అధికారం 2019లో చేజారింది….. 2019లో వచ్చిన అధికారం 2024లో చేజారింది

  1. వీడు పుoగనూరులొ 5 ఎళ్ళు బెదిరించి, కనీసం TDP వాళ్ళని ప్రచారం కూడా చెసుకొనివ్వకుండా, అదికార మదం తొ పొలీసులని అడ్డుపెట్టుకొని గెలిచాడు.

    .

    అంత పొటుగాడె అయితె రాజీనామ చెసి మళ్ళి గెలవమను. కనీసం డిపాజిట్ తెచ్చుకొమను!

Comments are closed.